కుటుంబాలు 2.27 లక్షలు | - | Sakshi
Sakshi News home page

కుటుంబాలు 2.27 లక్షలు

Published Sat, Dec 21 2024 7:40 AM | Last Updated on Sat, Dec 21 2024 7:40 AM

కుటుంబాలు 2.27 లక్షలు

కుటుంబాలు 2.27 లక్షలు

తాళం వేసిన ఇళ్లు 1,629
● ముగిసిన సమగ్ర కుటుంబ సర్వే ● ఆన్‌లైన్‌లో వివరాల నమోదు పూర్తి

మెదక్‌జోన్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర సర్వే ముగిసింది. జిల్లాలో 2,27,936 లక్షల కుటుంబాలు ఉన్నట్లు తేలింది. అయితే 1,629 ఇళ్లకు తాళం వేసి ఉన్నట్లు గుర్తించారు. అక్టోబర్‌ ఆఖరు వారంలో 1,852 మంది ఎన్యుమరేటర్లతో మొదలు పెట్టిన సర్వే ఈనెల 4వ తేదీ నాటికి పూర్తి చేశారు. ఆన్‌లైన్‌లో వివరాల నమో దు ప్రక్రియను సైతం పూర్తి చేశారు.

21 మండలాలు.. 4 మున్సిపాలిటీ లు

జిల్లాలో 21 మండలాలు, 4 మున్సిపాలిటీలతో పాటు 493 గ్రామ పంచాయితీలు ఉండగా, వాటి పరిధిలో 2,29,565 ఇళ్లకు ఎన్యుమరేటర్లు స్టిక్కర్లు అతికించారు. సుమారు నెలన్నర పాటు శ్రమించి 2,27,936 ఇళ్ల సర్వేను పూర్తి చేశారు. 1,629 ఇళ్లకు తాళం వేసి ఉండడంతో వదిలేశారు. ఈ లెక్కన జిల్లాలో 99.3 శాతం సర్వే చేశారు. నర్సాపూర్‌ మున్సిపాలిటీలో 4,650 ఇళ్లు ఉండగా 3,177 ఇళ్లు మాత్రమే సర్వే చేశారు. ఈ లెక్కన ఇంకా 1,473 ఇళ్లు చేయలేదు. మొత్తంగా 68.3 శాతం నమోదు కాగా 31.7 శాతం ప్రజలు సర్వేకు దూరంగా ఉన్నారు. అత్యధికంగా కొ ల్చారం మండలంలో 10,028 ఇళ్లు ఉండగా, 10,149 ఇళ్లను సర్వే చేశారు. ఈ లెక్కన 101.2 శాతం నమోదైంది. అలాగే చేగుంట, చిలప్‌చెడ్‌, హవేళిఘనాపూర్‌, కౌడిపల్లి, మనోహరాబాద్‌, నర్సాపూర్‌, నార్సింగి తదితర మండలాల్లో 100 శాతంపైగా సర్వే చేశారు.

కులాల జాబితా తర్వాతే..

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ముగిసిన నేపథ్యంలో కులాల వారీగా షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు చేయనున్నట్లు తెలిసింది. కాగా ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ఓటరు జాబితాను ఫైనల్‌ చేసిన అధికారులు, గ్రామాల్లో పోలింగ్‌ కేంద్రాలను సైతం గుర్తించారు. రిజర్వేషన్లు ఖరారు కాగానే స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తారని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement