దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టండి
మెదక్‌మున్సిపాలిటీ: కాంగ్రెస్‌కు దమ్ముంటే శాసనసభ సమావేశాల్లో ఫార్ములా ఈ– రేస్‌పై చర్చ పెట్టాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఫార్ములా ఈ– రేసును తీసుకొచ్చి కేటీఆర్ హైదరాబాద్ ఇమేజ్ పెంచారని కొనియాడారు. ఎలాంటి అవినీతి జరగకున్న కేటీఆర్‌ను అరెస్టు చేయాలని ప్రభుత్వం చూస్తుందన్నారు. 2023 ఫిబ్రవరిలో మొదటిసారి నిర్వహించిన ఫార్ములా ఈ– రేస్‌తో రాష్ట్రానికి రూ. 700 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. అలాగే హైదరాబాద్‌కు ఎలక్ట్రిక్ వాహ నాల కంపెనీలు సైతం వచ్చాయన్నారు. ఇందులో ఒక్క రూపాయి పక్కదారి పట్టలేదన్నారు. పర్యావరణాన్ని పరిరక్షణకు చర్యలు తీసుకున్నట్లు చెప్పా రు. కేసీఆర్ చరిత్రను రూపుమాపాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్‌రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ ఆంజనేయులుతో పాటు బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న పద్మారెడ్డి
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment