ఉత్సాహంగా సీఎం కప్ పోటీలు
మెదక్‌జోన్: సీఎం కప్ పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఐదవ రోజు శుక్రవారం బాల, బాలికల విభాగంలో పట్టణంలోని అవుట్ డోర్ ఇండోర్ స్టేడియంలో చెస్, యోగా పోటీలను నిర్వహించారు. అలాగే వెస్లీ ఉన్నత పాఠశాల మైదానంలో హ్యాండ్‌బాల్, జెడ్పీహెచ్‌ఎస్ నర్సాపూర్‌లో కిక్‌బాక్సింగ్ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన క్రీడాకారులను జిల్లా యువజన, క్రీడల అధికారి నాగరాజు అభినందించి బహుమతులు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొత్తం 58 మంది బాల, బాలికలు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. గెలుపొందిన క్రీడాకారులు ఈనెల 27వ తేదీ నుంచి హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షుడు కరణం గణేష్ రవికుమార్, జాతీయ రెఫరీ సత్యనారాయణ, పీడీలు శ్యామయ్య, దేవేందర్‌రెడ్డి, రాజేందర్, మహిపాల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment