25న ఏడుపాయలకుసీఎం రేవంత్‌రెడ్డి
పాపన్నపేట(మెదక్): ఈనెల 25వ తేదీన ఏడుపాయలకు సీఎం రేవంత్‌రెడ్డి రానున్నారు. ఈమేరకు కలెక్టర్ రాహుల్‌రాజ్ శుక్రవారం ఏడుపాయలలో పర్యటించారు. పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అమ్మవారి దర్శనం, పార్కింగ్ స్థలాలు, హెలిప్యాడ్ ఏర్పాటు ప్రదేశాన్ని కలెక్టర్ పరిశీలించారు. సీఎం పర్యటనలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఆలయ సిబ్బంది, అధి కారులు ఉన్నారు.
మైనార్టీ మహిళలకుఉచిత కుట్టు మిషన్లు
మెదక్ కలెక్టరేట్: ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద మైనార్టీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు అందజేయనున్నట్లు జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి జెమ్లా నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు హార్డ్ కాపీలను జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కార్యాలయంలో అందజేయాల్సిన అవసరం లేదని తెలిపారు.
విద్యార్థులు ఇష్టంగాచదవాలి: ఆర్డీఓ
మనోహరాబాద్(తూప్రాన్): విద్యార్థులు ఇష్టంతో చదివి భవిష్యత్‌కు మంచి బాటలు వేసుకోవాలని తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి అన్నా రు. శుక్రవారం మండలంలోని కూచారం కేజీబీవీ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం వంట గదిని తనిఖీ చేసి ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. వంటలు నాణ్యతతో చేయాలని సిబ్బందికి సూచించారు. ప్రభుత్వం విద్యార్థుల భోజనంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఆయన వెంట కేజీబీవీ ప్రత్యేక అధికారి గౌతమి, సిబ్బంది ఉన్నారు.
రాష్ట్రస్థాయి కబడ్డీ
పోటీలకు ఎంపిక
పాపన్నపేట(మెదక్): రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు 12 మంది క్రీడాకారులు ఎంపికై నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని యూసుఫ్‌పేటలో ఆయన మాట్లాడారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 27వ తేదీ నుంచి జనగాంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమంలో అసో సియేషన్ సెక్రటరీ రమేష్, జాయింట్ సెక్రటరీ శ్రీకాంత్, క్రీడాకారులు పాల్గొన్నారు.
జీవన నైపుణ్యాలు మెరుగుపర్చాలి
మెదక్ కలెక్టరేట్: విద్యార్థుల్లో జీవన నైపుణ్యాలను మెరుగుపర్చేలా బోధన చేయాలని డీఈఓ రాధాకిషన్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఓ గార్డెన్స్‌లో రిసోర్స్ పర్సన్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవన నైపుణ్యాల విద్యను సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ శిక్షణ ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ అధికారిణి హైమావతి, డీసీపీఓ కరుణశీల, అకాడమిక్ మానిటరింగ్ అధికారి సుదర్శనమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ప్రజా ఉద్యమాలకు
అండగా నిలవాలి
పటాన్‌చెరు టౌన్: ప్రజా సమస్యలకు కార్మిక వర్గం అండగా నిలవాలని, కార్మిక వర్గ సమస్యలపై సీపీఎం ముందుభాగాన నిలిచి పోరాడుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు పేర్కొన్నారు. సీపీఎం రాష్ట్ర మహాసభలను పురస్కరించుకుని సాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ చుక్కారాములుకు యూనియన్ ఆధ్వర్యంలో రూ.5 లక్షల విరాళం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment