శనివారం శ్రీ 21 శ్రీ డిసెంబర్ శ్రీ 2024
పర్యావరణపరిరక్షణపై సమర శంఖం.. అలుపెరుగని పోరాటం.. చెత్త సేకరణ, రీసైక్లింగ్‌లో మంచి ఫలితాలు.. ప్లాస్టిక్ నియంత్రణపై వ్యూహం.. ఫలితంగా తూప్రాన్ మున్సిపాలిటీకి ఘన కీర్తి దక్కింది. మున్సిపల్ కమిషనర్ గణేష్‌రెడ్డి చొరవ, ప్రణాళికతో ఈ అవార్డుసొంతం అయింది. – తూప్రాన్
మెదక్ జిల్లాలోని తూప్రాన్ మున్సిపాలిటీ కేంద్ర ప్రభుత్వ అవార్డుతో ఘన కీర్తి సాధించింది. నాలుగు గ్రామాల విలీనం తర్వాత మున్సిపాలిటీ పరిధిలో 16 వార్డులు, సుమారు 25 వేలకు పైగా జనాభా ఉంది. కుటుంబాలు 7,124 ఉన్నాయి. మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పరిరక్షణతో పాటు చెత్తను సేకరించేందుకు 46 మంది కార్మికులు పనిచేస్తున్నారు. చెత్త సేకరణకు 10 వాహనాలను వినియోగిస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి చెత్త సేకరణ జరుగుతోంది. సగటున రోజుకు 11 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. దానిని పట్టణ సమీపంలోని డంపింగ్ యార్డుకు చేరవేసి, అక్కడ తడి, పొడి చెత్తను వేరు చేస్తున్నారు. అక్కడే సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా సీస ముక్కలు, బ్యాటరీలు, ఇతర ఘన వ్యర్థాలు భూమిలో చేరి భూసారం దెబ్బతినకుండా రీసైక్లింగ్ చేస్తున్నారు. ఈ ప్రక్రియను సమర్థవంతంగా పర్యవేక్షించి మంచి ఫలితాలు తీసుకురావడంలో మున్సిపల్ కమిషనర్ గణేష్‌రెడ్డి కీలక పాత్ర పోషించారు.
కంపోస్ట్ తయారీ ఇలా..
పట్టణంలో రోజూ సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించి, అక్కడ తడి, పొడి చెత్తను వేరు చేసి 42 రోజుల పాటు నిల్వ చేస్తున్నారు. అది ఎరువుగా మారిన తర్వాత రోజుకు టన్ను చొప్పున హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు వినియోగిస్తున్నారు. ఫలితంగా మున్సిపాలిటీపై మొక్కలకు వినియోగించాల్సిన ఎరువుల భారం తగ్గుతోంది. అలాగే చెత్త నుంచి వేరు చేసిన డ్రై వేస్టును విక్రయిస్తున్నారు.
డంపింగ్ యార్డులో తడి, పొడి చెత్తను వేరుచేస్తున్న కార్మికులు
న్యూస్‌రీల్
పారిశుద్ధ్యంపై పోరాటం
పర్యావరణ పరిరక్షణలో జయకేతనం
తూప్రాన్ మున్సిపాలిటీకి ఘన కీర్తీ
కమిషనర్ ప్రత్యేక శ్రద్ధ
మరింత బాధ్యత పెంచింది
కేంద్ర ప్రభుత్వం చేంజ్ మేకర్ అవార్డు ప్రదానం చేయడం సంతోషం కలిగించింది. ఇది మరింత బాధ్యతను పెంచింది. పర్యావరణ పరిరక్షణతో పారిశుద్ధ్య నివారణ చర్యలు అవార్డుకు బాసటగా నిలిచాయి. ప్రభుత్వ ఆశయాల సాధనకు చిత్తశుద్ధితో కృషి చేయడంతో పాటు కార్మికుల్లో నూతన ఉత్తేజం కల్పిస్తూ వారి ద్వారా మరింత సేవలు అందించేలా చొరవ తీసుకుంటా.
– పాతూరి గణేష్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment