పనితీరు మార్చుకోండి
చిన్నశంకరంపేట(మెదక్): ‘రోగులకు సరైన వైద్య సేవలు అందడం లేదని అనేక ఫిర్యాదులు వస్తున్నాయి.. పరిసరాల పరిశుభ్రత సరిగా లేదు.. పనితీరులో మార్పురాకుంటే చర్యలు తప్పవు’ అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి వైద్యులు, సిబ్బందిని హెచ్చరించారు. సోమవారం నార్సింగి పీహెచ్‌సీలో రికార్డులను పరిశీలించి మాట్లాడారు. జాతీయ రహదారిపై ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలను మెరుగుపర్చాలన్నారు. ఇక ముందు ఎ లాంటి ఫిర్యాదులు వచ్చిన ఊపేక్షించేది లేదన్నారు. వైద్యులు రేఖ, రవీందర్‌కు పలు సూచనలు చేశారు. అనంతరం 108ను ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ సబిత, వైస్ ఎంపీపీ సుజాత, మల్లేశంగౌడ్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మైలారం బాబు, విష్ణువర్ధన్‌రెడ్డి, భూపతిరాజు పాల్గొన్నారు.
వైద్యులు, సిబ్బందిపై
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment