చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని మడూర్, ధరిపల్లి, సూరారం సబ్‌స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని చిన్నశంకరంపేట ట్రాన్స్‌కో ఏఈ దినకర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సబ్‌స్టేషన్‌లలో మరమ్మతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
నేడు రామాయంపేట బంద్
రామాయంపేట(మెదక్): జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా రామాయంపేట వద్ద బైపాస్ రోడ్డు నిర్మించవద్దని డిమాండ్ చేస్తూ వ్యాపార వర్గాలు మంగళవారం రామాయంపేట బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈమేరకు సోమవారం పట్టణంలో కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రస్తుతం ఉన్న రహదారి మీదుగానే జాతీయ రహదారిని నిర్మించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment