భోగి కాంతులు
ఎక్కడ చూసినా సంబురాలే
మెదక్‌జోన్: భోగభాగ్యాలను అందించే భోగి పండుగను సోమవారం జిల్లా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకొన్నారు. తెల్లవారుజామునే ఉత్సవాలను ప్రారంభించారు. సూర్యోదయానికి ముందే పల్లెపట్నం తేడా లేకుండా కాలనీలు, వీధుల్లో భోగి మంటలు వేశారు. పాతకు స్వస్తి పలికి నూతనత్వానికి స్వాగతం పలుకుతూ ఆనందంగా గడిపారు. ముంగిళ్లను శుభ్రపరిచి, అందమైన ముగ్గులు వేశారు. గొబ్బెమ్మలను పెట్టి, పూలు, నవధాన్యాలు పెట్టి అలంకరించారు. పట్టణంలో రాత్రి వేళ భోగి మంటలు వేశారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో పిడకలు, పూలు, రేగిపండ్లు, నవధాన్యాలను విక్రయించారు. చిన్నారులు పతంగు లను ఎగురవేస్తూ గంతులు వేశారు. దీంతో ఎక్కడ చూసినా పండుగ సందడే కనిపించింది.
ఇళ్ల ముంగిట కళకళలాడిన రంగవల్లులు పతంగులతో సరదాగా పిల్లలు, పెద్దలు నేడు మకర సంక్రాంతి రేపు కనుమ పండుగ
సంక్రాంతికి సర్వం సిద్ధం
మంగళవారం సంక్రాంతి పండుగను నిర్వహించుకునేందుకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. రంగు రంగుల రంగవల్లులు వేసేందుకు మహిళలు రంగులను కొనుగోలు చేశారు. పిండి వంటలను సిద్ధం చేశారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో కుటుంబ సభ్యులంతా ఒకే చోట చేరడంతో ప్రతి ఇంటా సందడి నెలకొంది. బుధవారం కనుమ పండగను నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment