సంక్రాంతి శుభాకాంక్షలు
మెదక్ మున్సిపాలిటీ: జిల్లాలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో సంక్రాంతి పర్వదిన వేడుకలు జరుపుకోవాలని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీస్‌శాఖ తరుఫున ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రజలందరికీ ప్రశాంతత, ఆనందం, విజయాన్ని అందించాలని కోరారు. ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని, ఇతరులకు హాని కలిగించకూడదని సూచించారు.
ఆనందంగా జరుపుకోవాలి: పద్మారెడ్డి
ప్రజల జీవితాల్లో సంక్రాంతి సుఖ సంతోషాలు నింపాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఇంటా భోగ భాగ్యాలు కల గాలని ఆకాంక్షించారు. సంక్రాంతి పండగను ఆనందంగా జరుపుకోవాలని.. పిల్లలు గాలిపటాలు ఎగురవేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
అదనపు కలెక్టర్ పూజలు
హవేళిఘణాపూర్(మెదక్): శివుడి ఆశీస్సులతో ప్రజలు ఆయురారోగ్యాలతో చల్లంగుండాలని అదనపు కలెక్టర్ నగేశ్ అకాంక్షించారు. సోమవారం మండల పరిధిలోని ముత్తాయికోట సిద్దేశ్వరాలయంలో శివలింగానికి అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పరమశివుడిని ఆరాధిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని అన్నారు.
సికింద్లాపూర్ ఆలయానికి రూ. 4.77 లక్షల ఆదాయం
శివ్వంపేట(నర్సాపూర్): ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధి చెందిన సికింద్లాపూర్ లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి వేలం పాటల ద్వారా రూ. 4.77 లక్షల ఆదాయం సమకూరింది. ప్రసా దాల అమ్మకం కోసం గోమారం గ్రామానికి చెందిన గంగిరెడ్డి వీరారెడ్డి 2 లక్షల 57 వేలకు వేలం పాడి దక్కించుకున్నారు. కొబ్బరికాయల అమ్మకం కోసం దౌల్తాబాద్‌కు చెందిన చెట్టుపల్లి వెంకటేష్‌గౌడ్ రూ. 2 లక్షల 20 వేలకు వేలం పాట పాడి దక్కించుకున్నారు. గతేడాది ప్రసాదాల విక్రయం లక్షా 60 వేలు, కొబ్బరికాయల విక్రయం రూ. లక్షా 70 వేలు పలకగా, ఈసారి రూ. లక్షా 47 వేల ఆదాయం అదనంగా ఆలయానికి వచ్చింది. కార్యక్రమంలో దేవాదాయశాఖ ఇన్‌స్పెక్టర్ రంగారావు, ఆలయ ఈఓ శశిధర్, ప్రధాన అర్చకులు ధనుంజయ్‌శర్మ, జూనియర్ అసిస్టెంట్లు నర్సింహారెడ్డి, సత్యజిత్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
దుర్గమ్మకు పల్లకీ సేవ
పాపన్నపేట(మెదక్): పౌర్ణమిని పురస్కరించుకొని సోమవారం ఏడుపాయలలో వన దుర్గమ్మకు పల్లకీ సేవ నిర్వహించారు. మొదట అమ్మవారి మూల విరాట్‌కు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం నుంచి రాజగోపురం మీదుగా గోకుల్‌షెడ్డు వద్దకు పల్లకీ సేవ నిర్వహించారు. దారి పొడవునా భక్తులు అమ్మవారి సేవలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది సూర్య శ్రీనివాస్, శ్యాం, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
దుబ్బాకటౌన్: పట్టణంలోని గురుకుల పాఠశాలలో 5 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ సుజాత సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తులకు ఫిబ్రవరి 1వ తేదీ చివరి తేదీ అని తెలిపారు. ఆసక్తి గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఫిభ్రవరి 23న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment