నత్తనడకన ఎల్‌ఆర్‌ఎస్
మెదక్‌జోన్: జిల్లాలోని మెదక్, నర్సాపూర్, రామా యంపేట, తూప్రాన్ పరిధిలో 2020 డిసెంబర్‌లో 11,380 మంది మీసేవ ద్వారా ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అప్పట్లో 1,191 దరఖాస్తులను మాత్రమే పరిష్కరించిన అధికారులు మిగితా వాటిని పెండింగ్‌లో పెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాది ఆగస్టులో ఎల్‌ఆర్‌ఎస్‌పై నిర్ణయం తీసుకుంది. ప్లాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని నిర్ణయించింది. ప్లాట్లు సక్రమంగా ఉన్నాయా..? లేవా.. అని పరిశీలించేందుకు మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలకు చెందిన అధికారులను ప్రత్యేకంగా నియమించింది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 10,182 ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు ఉండగా, ఇప్పటివరకు మెదక్, నర్సాపూర్ మున్సిపాలిటీలలో మాత్రమే సర్వేను ప్రారంభించారు. మెదక్‌లో 3,527 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, గతేడాది ఆగస్టులో సర్వేను ప్రారంభించిన అధికారులు ఇప్పటివరకు సుమారు 1,000 దరఖాస్తులను పరిశీలించి వాటికి సంబంధించిన ప్లాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అందులో పలు కారణాలతో 100 దరఖాస్తులను తిరస్కరించారు. 900 ప్లాట్లు సక్రమంగా ఉన్నాయని తేల్చారు. అలాగే నర్సాపూర్ మున్సిపాలిటీలో 1,936 దరఖాస్తులకు 430 పరిశీలించారు. వాటిలో 20 ప్లాట్లను తిరస్కరించారు. 58 ప్లాట్లు నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో నోటీసులు జారీ చేశారు. 7 మాత్రమే మాత్రమే సక్రమంగా ఉన్నాయని తేల్చారు. కాగా మొత్తంగా ఇప్పటివరకు 14శాతం ప్లాట్లను మాత్రమే పరిశీలించారు.
రామాయంపేట, తూప్రాన్‌లో నిల్
రామాయంపేట మున్సిపాలిటీలో 2,491 దరఖాస్తులు ఉండగా, ఇప్పటి వరకు ప్రక్రియ ప్రారంభం కాలేదు. అలాగే తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో 3,426 దరఖాస్తుల్లో ఒక్కటి కూడా పరిశీలనకు నోచుకోలేదు. ఈ మున్సిపాలిటీల్లో సిబ్బంది అంతా ఇన్‌చార్జిలుగా కొనసాగుతుండడంతో ప్లాట్ల క్రమబద్ధీకరణ ఇంకా ప్రారంభించలేదని తెలుస్తోంది. ఇంటి నిర్మాణం కోసం కొనుగోలు చేసిన ప్లాట్ల రిజిస్ట్రేషన్ ఎప్పుడు అవుతుందా? అని లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. క్రమబద్ధీకరిస్తే ఇళ్లు నిర్మించుకుంటామని పలువురు చెబుతున్నారు. త్వరతగతిన ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టమైనా ఆదేశాలు జారీ చేసినా క్షేత్రస్థాయిలో ముందుకుసాగడం లేదని వాపోతున్నారు.
జిల్లావ్యాప్తంగా 10,182 దరఖాస్తులు పరిశీలించినవి 1,430 మాత్రమే..
ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్) ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. జిల్లాలో దరఖాస్తుల పరిశీలన అనుకున్నంత వేగంగా జరగడం లేదు. ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించి ప్రక్రియను వేగిరం చేయాలని ఆదేశించినా ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment