హామీలు విస్మరించిన కాంగ్రెస్
జహీరాబాద్: గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్‌రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. మొగుడంపల్లి మండలంలోని ఉప్పర్‌పల్లి తండాలో జరుగుతున్న మోతీమాత జాతరలో సోమవారం హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గతంలో కేసీఆర్ 10% రిజర్వేషన్‌తో విద్య, ఉద్యోగాలలో గిరిజనులకు అవకాశం ఇచ్చారన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి తాగునీటి వసతులు కల్పించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ గిరిజన బంధు కింద రూ.12లక్షలు ఇస్తామన్న ఎన్నికల హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. విదేశాల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులకు ఓవర్సీస్ ఉపకారవేతనాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కె.మాణిక్‌రావు, చింతా ప్రభాకర్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ పాల్గొన్నారు.
మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజం
Comments
Please login to add a commentAdd a comment