అభివృద్ధికి పాటుపడతాం
నారాయణఖేడ్: స్వర్గీయ అప్పారావు షెట్కార్, శివురావు షెట్కార్, కిష్టారెడ్డిల అడుగుజాడల్లో నడుస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడతామని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, ఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి స్పష్టం చేశారు. స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ ఎమ్మెల్యే శివురావు షెట్కార్ వర్ధంతి సభ, సర్వధర్మ సమ్మేళనాన్ని పట్టణ శివారులోని ఆయన సమాధి వద్ద సోమవారం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలోనే ఈ ప్రాంత అభివృద్ధి జరిగిందన్నారు. జవహర్ నవోదయ విద్యాలయాన్ని ఖేడ్‌లో ఏర్పాటుచేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లా జెడ్పీ ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు నగేశ్ షెట్కార్, కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment