నేనుసైతం
ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం. నేరాల నియంత్రణకు నేను సైతం పేరిట సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. అందుకు అన్ని ప్రాధాన్యత ప్రాంతాలు, షాపింగ్ మాల్స్, దాబాల్లో అందుబాటులోకి వచ్చాయి. దీంతో చోరీలు ఇతర అసాంఘిక కార్యక్రమాలు తగ్గుముఖం పట్టనున్నాయి. వ్యాపారులు, మాల్స్ యజమానులు సహకరిస్తున్నారు. జిల్లా యంత్రాంగం కూడా తమ వంతుగా అవగాహన కల్పిస్తోంది. ఇప్పటికే సంచలనంగా మారని పలు కేసుల ఛేదనలో సీసీలు అత్యంత ప్రాధాన పాత్ర పోషించాయి.
నేరాల
నియంత్రణకు..
● సీసీ కెమెరాలతోనిందితుల పట్టివేత
● చిన్నశంకరంపేటలో సైకో కిల్లర్‌నుపట్టించిన నిఘా నేత్రం
● రామంతాపూర్‌లో అత్యాచారనిందితులను సైతం..
● జిల్లాలో వందలాది కెమెరాల ఏర్పాటు
మెదక్‌జోన్: మెదక్ జిల్లాలో పోలీసులు విస్తృతంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్రైవేట్, ప్రభుత్వ, వాణిజ్య, వ్యాపారులు, దాబాలు, హోటళ్లు, బేకరీలు, వైన్స్‌లతో పాటు గ్రామాల్లోనూ ఏర్పాటు చేయాలని ప్రోత్సహించారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా వందలాది కెమెరాలను ఏర్పాటు చేశారు. వ్యాపారులు వారి షాపుల లోపలతో పాటు బయట రోడ్డు కవరయ్యేలా, ఆ భవనం వెనుక భాగం సైతం పూర్తిగా కనిపించేలా సీసీలను ఏర్పాటు చేయాలని ప్రోత్సహించగా జిల్లాలో స్పందించి ముందుకు వచ్చి విరివిగా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఆయా కేసుల్లోని నిందితులుగా ఉన్నవారిని పట్టిస్తున్నాయి.
మాసాయిపేట మండలం రామంతాపూర్‌లో జనవరి 8న ఓ వ్యక్తికి సంబంధించిన పశువులు తప్పిపోగా గ్రామశివారులో గల ఓ దాబా వ్యక్తి ఏర్పాటు చేసిన సీసీ పుటేజీలను పరిశీలించారు. దాబా వెనుకాల ఓ మతిస్థిమితం లేని మహిళపై ముగ్గురు గ్యాంగ్ రేప్ చేసిన ఘటనలో నిందితులను పట్టించాయి. వాటి ఆధారంగా పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామానికి చెందిన సైకో కిల్లర్ 2024 నవంబర్ రెండవ వారంలో కేవలం వారం రోజుల వ్యవధిలో ఇద్దరిని దారుణంగా హత్య చేసి ఆనవాలు కనిపించకుండా ముఖంపై పెట్రోల్ పోసి తగులపెట్టాడు. శంకరంపేటలోని సీసీ కెమెరాలను పరిశీలించగా నిందితుడు ఓవైన్స్ ముందు మద్యం కొనుగోలు చేసినప్పడు, పోలీస్‌స్టేషన్ ముందు నుంచి నడిచి వెళ్లడం సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించారు. సునాయాసనంగా పట్టుకోగలిగారు. అంతేకాకుండా మెదక్ పట్టణంలో ప్రధాన రోడ్లలో, కూడళ్లతో పాటు ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాల్లో సైతం సీసీలను ఏర్పాటు చేయటంతో ఇటీవల 5 బైక్‌లను దొంగిలించిన పలువురు దొంగలను నిఘా నేత్రాలు పట్టించాయి.
Comments
Please login to add a commentAdd a comment