రోడ్డు నిర్మాణం కోసం నిరసనలు
నిజాంపేట(మెదక్): నిజాంపేట మండల కేంద్రంలో నస్కల్ రోడ్డు నిర్మాణం కోసం ఐదు రోజు రిలే నిరాహార దీక్షలో భాగంగా మంగళ, బుధవారాల్లో విద్యార్థులు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. నస్కల్ గ్రామాల ప్రజలు పండుగ రోజు సైతం దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నస్కల్, నందగోకుల్, రాంపూర్, నగరం, గ్రామాలకు రోడ్డు బాగోలేకపోవడంతో బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు గురవుతున్నామన్నారు. ఈ నాలుగు గ్రామాల విద్యార్థులు ఉన్నత చదువుల నిమిత్తం రామాయంపేట, సిద్దిపేటకు వెళ్లాలన్నా కాలినడకన లేదా రోడ్డుపై వెళ్లే వారిని లిఫ్ట్ అడిగే పరిస్థితి నెలకొందన్నారు. ఇకనైనా ఎమ్మెల్యే స్పందించి రోడ్డు పనులను ప్రారంభించాలని లేనిపక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. రోడ్డు పనులు పూర్తి అయ్యే వరకు దీక్షను విరమించబోమని భీష్మించకుని కూర్చున్నారు. దొంతరమైన దుర్గయ్య, మెట్టు లింగం, పాగాల ఎల్లం యాదవ్, విద్యార్థులు అనిల్, బాబు, నవీన్, అనిల్, దయాకర్, రమేశ్ పాల్గొన్నారు.
ఆర్‌అండ్‌బీ అధికారుల వివరణ
దీక్ష శిబిరానికి ఆర్‌అండ్‌బీ అధికారి ఏఈ సదార్ సింగ్ అక్కడకు చేరుకొని దీక్షను విరమించాలని కోరారు. రోడ్డు పనులను 15 రోజులలో పనులు ప్రారంభించి పనులు పూర్తి చేస్తామనిహామీనిచ్చారు.
ఐదో రోజుకు గ్రామస్తులనిలే నిరాహార దీక్షలు
పండుగ రోజూ.. సైతం ఆందోళన
దీక్ష శిబిరానికి ఆర్‌అండ్‌బీ అధికారులు
15 రోజుల్లో పనులు ప్రారంభిస్తామని భరోసా
Comments
Please login to add a commentAdd a comment