హత్నూర(సంగారెడ్డి): సంక్రాంతి పండుగ సందర్భంగా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు క్రికెట్ టోర్నమెంట్‌లు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం హత్నూర మండలం చింతల్ చెరువు గ్రామంలో ఐదు రోజులపాటు నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ పోటీల ముగింపు కార్యక్రమంలో విజేతలకు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వివిధ ప్రాంతాల్లో ఉన్న యువత పండుగ సందర్భంగా గ్రామానికి వచ్చి స్నేహితులతో కలిసి క్రికెట్ టోర్నమెంట్‌లలో పాల్గొనడం హర్షించదగ్గ పరిణామమన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు టోర్నమెంట్లు పెట్టడం అభినందనీయమన్నారు.
ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment