కత్తులతో యువకుల వీరంగం
తూప్రాన్: పతంగుల కొనుగోలు వ్యవహారంలో గొడవ చినికిచినికి గాలివానలా మారింది. ఓ దుకాణదారుడిపై పలువురు కత్తులతో దాడికి పాల్పడుతూ వీరంగం సృష్టించారు. మంగళవారం మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ కేంద్రంలో ఈ ఘటన కలకలం రేపింది. పట్టణంలోని 16వ వార్డులో వాటర్ ట్యాంకుల సమీపంలో కిరాణం దుకాణ నిర్వహిస్తున్న గణేష్ సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగులు, మంజా విక్రయిస్తున్నాడు. కాగా డబుల్ బెడ్రూంలో నివారం ఉంటున్న కొందరు సిక్కు యువకులు పతంగుల కొనుగోలు చేశారు. ధర ఎక్కువగా ఉందని గొడవకు దిగారు. వెంటనే డబుల్ బెడ్రూంలలో నివాసం ఉంటున్న ఆ వర్గానికి చెందిన వారికి ఫోన్ చేయడంతో పెద్ద సంఖ్యలో పురుషులు, మహిళలు దుకాణం వద్దకు చేరుకొని వస్తువులను చిందరవందరగా పడేశారు. కత్తులతో దాడికి యత్నించడంతో పాటు వీరంగం సృష్టించారు. విషయం తెలిసి పోలీసులు అక్కడకు చేరుకొవడంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. ఈ గొడవను కొందరు సెల్‌ఫోన్లలో వీడియోలు తీసి వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడడంతో జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. దాడికి పాల్పడిన వారిలో జగదీష్‌సింగ్, రాంసింగ్, అమర్‌సింగ్‌తో పాటు మరి కొందరిపై హత్యాయత్నం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.
దుకాణాదారుడిపై దాడి
పతంగుల విషయంలో గొడవ
తూప్రాన్‌లో కలకలం
Comments
Please login to add a commentAdd a comment