అన్నదాతకు సంపూర్ణ ‘మద్దతు’
● వ్యవసాయ భూములకు ‘భరోసా’ ● మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
సిద్దిపేటజోన్: అన్నదాతలకు మద్దతు ధర అందించే లక్ష్యంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పత్తి మార్కెట్ యార్డులో కంది కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. క్వింటాలు కందులకు రూ.7,550 ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందన్నారు. కొనుగోలు కేంద్రాలను సరుకును విక్రయించి రైతులు మద్దతు ధరను పొందాలని సూచించారు. ప్రభుత్వం వరి, మొక్కజొన్న, పత్తి, పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలను సమర్థంగా నిర్వహించిందన్నారు. వరి ధాన్యం కొనుగోలు చేసిన 48గంటల్లో రైతులకు డబ్బులు చెల్లించామన్నారు. అలాగే సన్నరకం వడ్లకు రూ. 500 బోనస్ ఇచ్చామన్నారు. ఈ నెల 26నుంచి వ్యవసాయయోగ్యమైన భూములకు రైతు భరోసా ఇవ్వనున్నామని అన్నా రు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించామన్నారు. అర్హులైన వారందరికీ రేషన్ కారు ్డలను పంపిణీ చేస్తామన్నారు. త్వరలో ఆయిల్ పామ్ సాగు కోసం అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment