పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి
● వ్యవసాయ బావులకు కేరాఫ్ అప్పనపల్లి
● ఇవే ఆ ఊరికి జీవనాధారం
● తరాల నుంచి వీటితోనే పంటల సాగు
● ఎంత కరవొచ్చినా తగ్గని నీళ్లు
● 600 పైగా బావులుంటే..
20 లోపు మాత్రమే బోర్లు
● ఐదు గజాల లోతుల్లోనే నీటి ఊటలు
● ఇది అప్పన్నపల్లి ‘జల’దృశ్యం
ఊరు చుట్టూ ఎత్తయిన గుట్టలు.. పరిచినట్లు కనిపించే బండరాళ్లు. పక్షుల కిలకిలరావాల మధ్య ఎటుచూసినా పచ్చని పంటలతో ప్రకృతి ఒడిలో ఒదిగినట్లు కనిపించే అందమైన పల్లె. సృష్టికి ప్రతిసృష్టి సృష్టిస్తూ ఎన్నో అద్భుతాలు.. ప్రయోగాలతో దూసుకుపోతున్న ఈ హైటెక్ రోజుల్లోనూ దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామంలో వ్యవసాయ బావులపైనే ఆధారపడుతున్నారు. 5 గజాలు తవ్వితే చాలు నీరు ఉబికి వస్తుంది. ఊరు ఊరంతా ఇదే పరిస్థితి. దీంతో గ్రామంలో బోర్లు వేయడం మానేసి.. పాత రోజుల మాదిరిగానే బావులు తవ్వుతున్నారు. పచ్చని పంటలు సాగు చేస్తున్న రైతన్నకు కల్పవల్లి అయిన అప్పనపల్లి గ్రామంపై ‘సాక్షి’ప్రత్యేక కథనం.
మెదక్‌జోన్/చేగుంట(తూప్రాన్): పదో తరగతిలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో సమీక్ష సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు డ్రాపౌ ట్ కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నా రు. ప్రత్యేక తరగతుల ద్వారా విద్యాబోధన జరగాలన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులు పెంచే విధంగా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఈఓ రాధాకిషన్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి పాల్గొన్నారు. అలాగే వడియారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. విద్యార్థులకు లెక్కలు బోధించా రు. పదోతరగతిలో ఎక్కువ మార్కులు సాధించేందుకు పాటించాల్సిన పద్ధతులు వివరించారు. అనంతరం వంటశాల, తరగతి గదులను పరిశీలించారు.
గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయండి
మెదక్ కలెక్టరేట్: ఈనెల 26న నిర్వహించనున్న గణతంత్ర వేడుకలకు ఘనంగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాలు మేరకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా లబ్ధిదారులకు అందించే విషయంపై సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. సమగ్ర సమాచారంతో రిపబ్లిక్ డే ఆహ్వాన పత్రికలు తయారు చేయాలన్నారు. శాఖల వారీగా చేపట్టబోయే కార్యక్రమాలపై కార్యాచరణ ముమ్మరం చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ మహేందర్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్‌ఓ భుజంగరావు, ఆర్డీఓ రమాదేవి, సంబంధిత ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
8లో
– దుబ్బాక రూరల్/దుబ్బాక
కలెక్టర్ రాహుల్‌రాజ్
Comments
Please login to add a commentAdd a comment