మెదక్ కలెక్టరేట్: దివ్యాంగుల పెన్షన్ రూ. 5 వేలకు పెంచాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా కార్యదర్శి యశోద ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెన్షన్ పెంపుపై ఫిబ్రవరి 10న నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను సోమవారం మెదక్‌లో ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దివ్యాంగులకు రేషన్ కార్డు ఇవ్వాలని, బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయాలని, ఉపాధి హామీ పని కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎన్‌పీఆర్డీ వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గ, జిల్లా కమిటీ సభ్యులు భాగ్యలక్ష్మి, రాణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment