పైరవీలకు తావు లేదు
ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి
అర్జీలు పరిశీలిస్తున్న
ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి
మెదక్ మున్సిపాలిటీ: ఏమైనా సమస్యలుంటే మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా వచ్చి పరిష్కరించుకోవాలని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి ప్రజలకు సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. ఈసందర్భంగా బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. తక్షణ పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్ అధికారులతో మాట్లాడారు. సమస్య స్థితిని, పరిష్కారానికి పలు సూచనలు చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా పోలీస్ సేవలను వినియోగించుకోవాలన్నారు. సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకోవాలని తెలిపారు. శాంతి భద్రతలను పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్‌శాఖ పని చేస్తుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment