తక్షణ పరిష్కారం చూపండి
పరిహారమిచ్చి ఆదుకోండి
పొలం వద్ద పనులు చేస్తుండగా పిడుగుపాటుతో మా తండ్రి ఇమ్మడి రాజయ్య గతేడాది సెప్టెంబర్ 4వ తేదీన మృతి చెందాడు. కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం స్పందించి పరిహారం అందించి ఆదుకోవాలి. – గణేష్, వాడి, హవేళిఘణాపూర్
రుణమాఫీ కావడం లేదు
లక్ష్మాపూర్ ఏపీజీవీబీ బ్యాంకులో లక్షలోపు పంట రుణం తీసుకున్నాం. మాకు ఇప్పటివరకు రుణ మాఫీ కాలేదు. ప్రభుత్వం రూ. రెండు లక్షలలోపు బకాయిలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. కాని లక్షలోపు ఉన్న మా రుణం మాత్రం మాఫీ కాలేదు. ఇప్పటికై నా రుణమాఫీ చేసి ఆదుకోండి.
– రాగుల సిద్దమ్మ, లక్ష్మాపూర్
మెదక్ కలెక్టరేట్: ప్రజావాణిలో వినతులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి వెంటనే పరిష్కారం చూపాలని అదనపు కలెక్టర్ నగేష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి మాట్లాడారు. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న అర్జీలను సైతం వెంట వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ప్రజావాణికి 102 వినతులు రాగా వాటిలో అత్యధికంగా ధరణి సమస్యలపై 38, ఇందిరమ్మ ఇళ్ల కోసం 11, రుణమాఫీపై 3, రేషన్ కార్డులు కా వాలని 10, ఇతర సమస్యలపై 40 వరకు వచ్చాయి. ప్రజావాణి కార్యక్రమంలో డీఆర్‌ఓ భుజంగరావు, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావుతో పాటు అన్నిశాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పొలం ఆక్రమించారు
బతుకుదెరువు కోసం పట్నం పొతే.. మా పొలాన్ని ఆక్రమించుకొని అన్యాయం చేస్తున్నారు. మెదక్ మండలం అవుసుపల్లి శివారులోని 573 సర్వే నంబర్‌లో రెండెకరాలను 1979లో అప్పటి ప్రభుత్వం మా తండ్రి పోచయ్య పేరున పట్టా చేసి ఇచ్చింది. నాటి నుంచి మా ఆధీనంలోనే ఆ భూమి ఉంది. కొంతకాలంగా మేము బతుకుదెరువు నిమిత్తం పట్నం వెళ్లగా గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు మా భూమి ఆక్రమించుకున్నారు. అధికారులు న్యాయం చేయాలి. – గాయంతి సాయిలు, అవుసులపల్లి
అదనపు కలెక్టర్ నగేష్
ప్రజావాణికి 102 వినతులు
Comments
Please login to add a commentAdd a comment