పల్లె పోరు హడావుడి | - | Sakshi
Sakshi News home page

పల్లె పోరు హడావుడి

Published Sat, Jan 25 2025 8:18 AM | Last Updated on Sat, Jan 25 2025 8:17 AM

పల్లె

పల్లె పోరు హడావుడి

గాజులపల్లి టూ ఢిల్లీ తెలుగు భాష మీద ఉన్న అభిమానం యువకుడిని సిద్దిపేట డిగ్రీ కళాశాల నుంచి ఢిల్లీ దాకా నడిపించింది. వివరాలు 10లో u

శనివారం శ్రీ 25 శ్రీ జనవరి శ్రీ 2025

చిన్నశంకరంపేట(మెదక్‌): పంచాయతీ సమరంలో తామే ముందు వరుసలో ఉండాలని నాయకులు తహతహలాడుతున్నారు. ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయడంతో ఎప్పుడైనా నోటిఫికేషన్‌ రా వొచ్చని భావిస్తున్న నాయకులు విందులు, విహారయాత్రలకు తెరలేపారు. జిల్లాలో ఎక్కడ చూసిన స్థానిక సంస్థల ఎన్నికల గురించే చర్చంచుకుంటున్నారు. ప్రభుత్వం గ్రామసభలు పూర్తి చేసి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టిన కొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్‌ వస్తుందని అనుకుంటున్నారు. దీంతో పల్లెల్లో నాయకులు తమకు మద్దతుగా కలిసి రావాలని ఇప్పటినుంచే మచ్చిక చేసుకుంటున్నారు. నార్సింగి మండలంలోని ఒక గ్రామంలో పదవిపై కన్నేసిన అధికార పార్టీకి చెందిన నాయకుడు గ్రా మంలో వంద మందిని తన వెంట విహారయాత్రకు తీసుకెళ్లాడు. ఇది గమనించిన అదే పార్టీకి చెందిన ఓ నాయకుడు అమ్మవారి మొక్కు పేరిట పెద్ద విందును ఏర్పాటుచేశారు. తామేమి తక్కువ అంటూ మరో నాయకుడు తన పొలం వద్ద మొక్కు పేరుతో పెద్ద దవాత్‌ ఇచ్చి మద్దతుదారులను ప్రసన్నం చేసుకున్నాడు. చిన్నశంకరంపేట, నార్సింగి, చేగుంట లాంటి పెద్ద పంచాయతీలలో పోటీదారులు ఓట ర్లను ప్రసన్నం చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. ఎన్నికల కోసం అవసరమైన నిధులు సమకూర్చుకునేందుకు ఉన్న ప్లాట్లను అమ్మి మరి డబ్బులు పోగు చేసుకుంటున్నారు. అలాగే ఎన్నికల బరిలో ఉంటామనుకున్న నాయకులు సంక్రాంతి పండుగను చక్కగా వినియోగించుకున్నారు. కొందరు యువతను ప్రసన్నం చేసుకునేందుకు కబడ్డీ, క్రికెట్‌ పోటీలు ఏర్పాటు చేయగా.. మరికొందరు పండగ రోజు తమకు కావాల్సిన వారిని ఒక చోటకు పిలిచి దవాత్‌ ఏర్పాటు చేశారు. అవకాశం కలిసొస్తే తప్పకపోటీలో ఉంటామని, మద్దతుగా నిలబడాలని ముందస్తుగా మాట తీసుకున్నారు. మరికొందరు మాత్రం సైలెంట్‌గా తాము పోటీదారులమేనని చెప్పకనే చెప్పుకుంటున్నారు. ఇప్పటి నుంచే ఇలా ఖర్చు పెడితే గెలిచాక ఊరును అమ్ముకుంటారా అని పలువురు వ్యగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు.

న్యూస్‌రీల్‌

ఎవరికి వారే అభ్యర్థులుగా ప్రచారం

విందులు.. విహారయాత్రలతో ప్రసన్నం

ఇప్పటికే సంక్రాంతి

క్రీడా పోటీల నిర్వహణ

No comments yet. Be the first to comment!
Add a comment
పల్లె పోరు హడావుడి1
1/1

పల్లె పోరు హడావుడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement