![ఎన్నికలకు సన్నద్ధం కావాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/12mdk12-350122_mr-1739413868-0.jpg.webp?itok=H9rSHCRI)
ఎన్నికలకు సన్నద్ధం కావాలి
అదనపు కలెక్టర్ నగేష్
మెదక్ కలెక్టరేట్: సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని అ దనపు కలెక్టర్ నగేష్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో రిటర్ని ంగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, డీఎల్పీఓలకు మొదటి దశ శిక్షణ కా ర్యక్రమం నిర్వహించగా.. అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలో 492 సర్పంచ్, 190 ఎంపీటీసీ, 21 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నట్లు చెప్పారు. ఎన్నికల కోసం ముందస్తుగానే అన్నిరకాల ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఆదేశించారు. ఎలాంటి వివాదాలు, తప్పిదాలకు తావులేకుండా ముందుకుసాగాలని సూచించారు. నోటిఫికేషన్ జారీ చేసి మండల పరిషత్ కార్యాలయాల్లో నామినేషన్ల ప్రక్రియను చేపట్టాల్సి వస్తుందని తెలిపారు. తదుపరి అన్నిరకాల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. బ్యాలెట్ పేపర్‌ను అభ్యర్థుల పేర్లపై తెలుగు అక్షర మాల క్రమపద్ధతిలో ముద్రించాల్సి ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీపీఓ యాదయ్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఎంపీడీఓలు, ఎంపీఓలు, డీఎల్పీఓలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment