![కాంగ్రెస్‌కు ఓట్లడిగే హక్కులేదు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/12nrs21-350105_mr-1739413870-0.jpg.webp?itok=rvZpYSB7)
కాంగ్రెస్‌కు ఓట్లడిగే హక్కులేదు
వెల్దుర్తి(తూప్రాన్)/రామాయంపేట(మెదక్): పథకాల పేరుతో కాలయాపన చేస్తున్న కాంగ్రెస్‌కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లడిగే నైతిక హక్కు లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విష్ణువర్దన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని రేణుకా ఎల్లమ్మ దేవాలయం వద్ద బుధవారం నిర్వహించిన సమావేశానికి వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచారంపై చర్చించా రు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కొమురయ్యను, పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించేలా నాయకులు, కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు దాసు, జిల్లా నాయకుడు శ్రీనివాస్‌గౌడ్, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే రామాయంపేట పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మల్లేశ్‌గౌడ్ పాల్గొని మాట్లాడారు. ప్రతి వంద మంది పట్టభద్రులకు ఒక ఇన్‌చార్జిని నియమించుకుంటే ప్రచారం సాఫీగా సాగుతుందని అన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జి గడ్డం శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాగి రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, పార్టీ పట్టణ అధ్యక్షుడు అవినాశ్‌రెడ్డి, మండలశాఖ అధ్యక్షుడు నవీన్‌గౌడ్ పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్
Comments
Please login to add a commentAdd a comment