![వైద్య](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/12mdk47-350086_mr-1739413869-0.jpg.webp?itok=mfnDgkgT)
వైద్య సేవలు మరింత మెరుగుపర్చాలి
హవేళిఘణాపూర్(మెదక్): ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు మరింత మెరుగుపర్చాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందని డీఎంహెచ్‌ఓ శ్రీరామ్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని సర్ధన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈసందర్భంగా వంద రోజుల టీబీ ప్రోగ్రాం, 30 ఏళ్లు పైబడిన వారిలో రోగ నిర్ధారణ, గర్భిణులకు చికిత్స, దీర్ఘకాలిక రోగాలు.. భవిష్యత్‌లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. రాబోయే రోజుల్లో ఇలాగే సేవలందిస్తూ జిల్లాలోని పీహెచ్‌సీలకు ఆదర్శంగా నిలవాలని కొనియాడారు. అలాగే ఆస్పత్రికి వస్తున్న ఆస్పత్రి అభివృద్ధి నిధుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డాక్టర్ వినయ్, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.
అడవిలో అగ్ని ప్రమాదం
రామాయంపేట(మెదక్): మండలంలోని అక్కన్నపేట అటవీ ప్రాంతంలో బుధవారం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న రేంజ్ అటవీ అధికారి విద్యాసాగర్ తన సిబ్బందితో వెళ్లి మంటలను ఆర్పి వేయించారు. సకాలంలో మంటలు ఆర్పకపోతే అట వీ ప్రాంతానికి నష్టం వాటిల్లేదన్నారు. పలువురు బీడీలు, సిగరెట్లు తాగుతూ నిర్లక్ష్యంగా పారవేస్తుండడంతో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు.
మీసేవ కేంద్రాల తనిఖీ
మెదక్ కలెక్టరేట్: మీసేవ కేంద్రాల నిర్వాహకులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఈడీఎం సందీప్ సూచించారు. బుధవారం జిల్లాలోని పలు మీసేవ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలక్ట్రానిక్ సర్వీస్ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని మీసేవ కేంద్రాలను తనిఖీ చేసినట్లు చెప్పారు. కేంద్రాలు సమర్థవంతంగా పనిచేసేందుకు తగు సూచనలు చేసినట్లు తెలిపారు. ప్రజల నుంచి అదనపు చార్జీలు వసూలు చేయకుండా నిబంధనల ప్రకారం సేవలందించాలని సూ చించారు. ఆయన వెంట కార్యాలయ సిబ్బంది శశికాంత్ పాల్గొన్నారు.
దుర్గమ్మకు పల్లకీ సేవ
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల దుర్గమ్మకు బుధవారం సాయంత్రం పల్లకీ సేవ నిర్వహించారు. పౌర్ణమిని పురస్కరించుకొని యాగశాల లో అర్చకులు చండీయాగం చేశారు. సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఉత్సవ విగ్రహాన్ని పూలమాలలతో అలంకరించి పల్లకీలో ఊరేగించారు.
ఇద్దరి బైండోవర్
మనోహరాబాద్ (తూప్రాన్): అక్రమంగా మట్టి తరలిస్తున్న ఇద్దరిని బుధవారం తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్‌ఐ సుభాష్‌గౌడ్ తెలిపారు. కూచారం గ్రామానికి చెందిన గోవర్ధన్‌రెడ్డితో పాటు అంజనేయులు పలుమా ర్లు మట్టిని అక్రమంగా తరలిస్తూ పట్టుబడగా.. కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. అయినా మానుకోకపోవడంతో బైండోవర్ చేసినట్లు వివరించారు.
![వైద్య సేవలు మరింత మెరుగుపర్చాలి
1](https://www.sakshi.com/gallery_images/2025/02/13/12mdk77a-350085_mr-1739413869-1.jpg)
వైద్య సేవలు మరింత మెరుగుపర్చాలి
![వైద్య సేవలు మరింత మెరుగుపర్చాలి
2](https://www.sakshi.com/gallery_images/2025/02/13/12mdk29-350125_mr-1739413869-2.jpg)
వైద్య సేవలు మరింత మెరుగుపర్చాలి
![వైద్య సేవలు మరింత మెరుగుపర్చాలి
3](https://www.sakshi.com/gallery_images/2025/02/13/12mdk13-350122_mr-1739413869-3.jpg)
వైద్య సేవలు మరింత మెరుగుపర్చాలి
Comments
Please login to add a commentAdd a comment