బీఆర్‌ఎస్ నేతలవి మొసలి కన్నీరు
నర్సాపూర్: డంప్‌యార్డు ఏర్పాటును పెద్ద సమస్యగా చూపి బీఆర్‌ఎస్ పబ్బం గడుపుకోవాలని చూస్తుందని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ ఆరోపించారు. బుధవారం కాంగ్రెస్ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రజలను కులాలు, మతాలు, ప్రాంతాలుగా విభజించే కుట్ర చేస్తూ మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. డంప్‌యార్డు సమస్యను మంత్రుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ.. మాజీ మంత్రి హరీశ్‌రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అబద్దాలు చెప్పి ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. ప్యారానగర్ డంప్‌యార్డు, కులగణనపై వారికి మాట్లాడే హక్కు లేదన్నారు. బీఆర్‌ఎస్ హయాంలోనే డంప్‌యార్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నారని తెలిపారు. అనాడు సునీతారెడ్డి బీఆర్‌ఎస్‌లో ఉన్నారని, ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి సమస్యను వివరించి డంప్‌యార్డును ఇతర ప్రాంతాలకు తరలించేందుకు తమ వంతుగా కృషి చేస్తామని చెప్పారు. సమావేశంలో నాయకులు మల్లేష్, శ్రీనివాస్‌గుప్తా, చిన్న ఆంజిగౌడ్, మహేష్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, రవిగౌడ్, రషీద్, అజ్మ త్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పలువురికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్
Comments
Please login to add a commentAdd a comment