![ఉద్యోగం చేస్తారా.. ఇంటికి పోతారా?](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/12jgp41-350080_mr-1739413872-0.jpg.webp?itok=BsamETRD)
ఉద్యోగం చేస్తారా.. ఇంటికి పోతారా?
ఉపాధ్యాయులపై డీఈఓ సీరియస్
రేగోడ్(మెదక్): ఉద్యోగం చేయాలని ఉందా.. ఇంటికి పోతారా..? అంటూ డీఈఓ రాధాకిషన్ ఉపా ధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలు, ఎంఆర్‌సీ కార్యాలయాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా రేగోడ్‌లోని ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కాంప్లెక్స్ సమావేశంలో మాట్లాడారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదన్నారు. సాకులు చెబుతూ తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. పనిచేయని వారిని గుర్తించి చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఉన్నత పాఠశాల హెచ్‌ఎంపై ఫిర్యాదు వచ్చిందని, అందరికీ ఆదర్శంగా ఉండాల్సింది పోయి.. నిర్లక్ష్య ంగా వ్యవహరిస్తే ఎలాగని ప్రశ్నించారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని, ఇలాగైతే స్కూల్ ఉంచుదామా..? ఎత్తేద్దామా అని అడిగారు. సంగమేశ్వర తండాలో బడి మూతపడిందని గతంలో ‘సాక్షి’లో వచ్చిన పలు కథనాలపై డీఈఓ స్పందించారు. ఆ పాఠశాల ఉపాధ్యాయురాలు రెండేళ్లుగా డిప్యూటేషన్‌పై వెళ్లారని, రెండేళ్లు దాటితే వేతనం నిలిపివేస్తామని చెప్పారు. త్వరలోనే పాఠశాలను ప్రారంభిస్తామన్నారు. మోడల్ స్కూల్ వసతి గృహాన్ని సైతం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించి బాలికలకు వసతి కల్పిస్తామని తెలిపారు. అనంతరం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు భోజనం వడ్డించారు.
Comments
Please login to add a commentAdd a comment