మహిళల భద్రతకే షీటీమ్స్
మెదక్ మున్సిపాలిటీ: మహిళలు మౌనం వీడి నిర్భయంగా ముందుకు రావాలని అదనపు ఎస్పీ మ హేందర్ పిలుపునిచ్చారు. బుధవారం రాష్ట్ర ఉమెన్ సేఫ్టీవింగ్ ద్వారా నిర్వహించిన ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. షీటీం ఆధ్వర్యంలో 72 మంది ఈవ్ టీజర్స్‌కు ఆన్‌లైన్ కౌన్సిలింగ్ నిర్వహించినట్లు చెప్పారు. ఇందులో 13 మంది మైనర్లు, 59 మంది యుక్త వయసు వారు ఉన్నారని తెలిపారు. షీ టీమ్స్ ఎల్లవేళలా అందుబా టులో ఉండి సేవలు అందిస్తాయన్నారు. షీటీం ఫిర్యాదులు, క్యూఆర్ కోడ్ గురించి వివరించారు. అన్ని బస్టాండ్లు, సినిమా హాళ్లు, స్కూళ్లు, కళాశాలలు, కార్యాలయాలు, రద్దీ ప్రాంతాల్లో షీటీం నంబర్లు, క్యూఆర్ కోడ్‌లతో కూడిన పోస్టర్లు ఉంటాయని తెలిపారు. మహిళలు అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు కాల్ చేసి తక్షణ పోలీస్ సహాయం పొందాలని సూచించారు. అలాగే వా ట్సాప్ నంబర్ 8712657963లో ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో గంగాధర్, బాల నర్సింలు, కానిస్టేబుళ్లు ప్రమీల, విజయ్, గంగమణి, స్వరూప, విజయరాణి తదితరులు పాల్గొన్నారు.
అదనపు ఎస్పీ మహేందర్
Comments
Please login to add a commentAdd a comment