Akshay Kumar & Kriti Sanon Bachchan Pandey Set Catches Fire While Shooting - Sakshi
Sakshi News home page

Akshay Kumar: స్టార్ హీరో సెట్స్‌లో అగ్నిప్ర‌మాదం

Published Sat, Jan 15 2022 10:06 PM | Last Updated on Sun, Jan 16 2022 9:34 AM

Akshay Kumar Kriti Sanon Bachchan Pandey Set Catches Fire While Shooting - Sakshi

స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ న‌టిస్తున్న బ‌చ్‌ప‌న్ పాండే సెట్స్‌లో అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. చివ‌రిద‌శ షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ మూవీ సెట్స్‌కు నిప్పంటుకోగా అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది వెంట‌నే మంట‌ల‌ను అదుపులోకి తెచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ ప్ర‌మాదంలో ఎవ‌రూ గాయ‌ప‌డ‌లేదని స‌మాచారం. కాగా అక్ష‌య్ కుమార్ హీరోగా క‌నిపించ‌నున్న ఈ సినిమాలో కృతీ స‌న‌న్‌, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. బాబీ సింహ‌, సిద్ధార్థ, ల‌క్ష్మీ మీన‌న్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ మూవీ ద‌క్షిణాది చిత్రం జిగార్తాండకు రీమేక్ అన్న ప్ర‌చారం న‌డుస్తోంది. 

అక్ష‌య్ కుమార్ సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం అత‌డు సెల్ఫీ సినిమా చేస్తున్నాడు. రాజ్ మెహ‌తా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను అరున భాటియా, య‌శ్ జోహార్‌, సుప్రియ మీన‌న్‌, క‌ర‌ణ్ జోహార్‌, పృథ్వీరాజ్ సుకుమార‌న్‌, అపూర్వ మెహ‌తా, లిస్టిన్ స్టెఫెన్ నిర్మిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement