ఇద్దరు భర్తలు నరకం చూపించారు!: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ | Bigg Boss Sneha Wagh Comments on Her Failed Marriages | Sakshi
Sakshi News home page

Bigg Boss: 'మొదటి భర్త హింసించాడు, రెండోవాడు టార్చర్‌ పెట్టాడు'

Published Wed, Sep 22 2021 7:31 PM | Last Updated on Wed, Sep 22 2021 7:59 PM

Bigg Boss Sneha Wagh Comments on Her Failed Marriages - Sakshi

బిగ్‌బాస్‌ మరాఠీ మూడో సీజన్‌లో పాల్గొన్న అందరిలో కెల్లా నటి స్నేహ వాగ్‌- నటుడు ఆవిశ్కర్‌ దర్వేకర్‌ జంట స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. కారణం వీళ్లిద్దరూ ఒకప్పుడు భార్యాభర్తలు. స్నేహ 19 ఏళ్ల వయసులో ఆవిశ్కర్‌ను పెళ్లాడింది. కానీ వీరి దాంపత్య జీవితం ఎంతో కాలం కొనసాగలేదు. తన భర్త శారీరకంగా హింసిస్తున్నాడంటూ అతడికి విడాకులిచ్చేసింది. ఆ తర్వాత 2015లో ఇంటీరియర్‌ డిజైనర్‌ అనురాగ్‌ సోలంకిని వివాహం చేసుకుంది, కానీ పెళ్లైన ఎనిమిది నెలలకే అతడితో కూడా బంధాన్ని తెగదెంపులు చేసుకుంది. 

స్నేహ తన రెండు పెళ్లిళ్లు పెటాకులవడం గురించి మాట్లాడిన ఇంటర్వ్యూ ఒకటి వైరల్‌గా మారింది. మొదటి భర్త హింసించాడని, రెండో భర్త టార్చర్‌ పెట్టాడని సదరు ఇంటర్వ్యూలో వాపోయింది. ఆమె చేసిన వ్యాఖ్యలపై నటి కామ్య పంజాబీ ఘాటుగా స్పందించింది. 'అసలు నువ్వేం అనుకుంటున్నావు? నీ ఇద్దరు మాజీ భర్తలు బిగ్‌బాస్‌లోకి రావాలని చూస్తున్నావా? చాలా బాగుంది. కానీ ఎందుకు బాధితురాలిని అంటూ విక్టిమ్‌ కార్డ్‌ ప్లే చేస్తున్నావు? నీ ఫస్ట్‌ మ్యారేజ్‌ గురించి నాకు తెలీదు.. కానీ రెండో పెళ్లి గురించి మాత్రం ఇలాంటి కథలు అల్లాలని ప్రయత్నించకు. నేను వాస్తవాలను బయటకు తీయగలను అన్న సంగతి నీకు బాగా తెలుసు. గుడ్‌ లక్‌, కానీ గేమ్‌ మాత్రం చెండాలంగా ఆడకు' అని ట్వీట్‌ చేసింది. తనకు సపోర్ట్‌ చేసినందుకుగానూ కామ్యకు అనురాగ్‌ కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే తను టార్చర్‌ పెట్టానని రుజువు చేయమని స్నేహకు సవాలు విసిరాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement