Bigg Boss 8: ఆరోవారం సీత ఎలిమినేట్‌ | Bigg Boss Telugu 8: Kirrak Seetha Entered As 9th Contestant | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 8: తొమ్మిదో కంటెస్టెంట్‌గా కిర్రాక్‌ సీత

Published Sun, Sep 1 2024 8:45 PM | Last Updated on Sun, Oct 13 2024 11:11 PM

Bigg Boss Telugu 8: Kirrak Seetha Entered As 9th Contestant

బోల్డ్‌ కంటెంట్‌తో పాపులర్‌ అయింది కిర్రాక్‌ సీత. పలు షార్ట్‌ ఫిలింస్‌ చేసిన ఈ బ్యూటీ బేబి మూవీలోనూ యాక్ట్‌ చేసింది. హీరోయిన్‌ ఫ్రెండ్‌గా నెగెటివ్‌ క్యారెక్టర్‌ పోషించింది. ఎక్కువగా ఆ తరహా పాత్రల్లోనే కనిపించింది. అయితే బేబి సినిమా వల్ల ఎక్కువ నెగెటివిటీ మూటగట్టుకుంది. తాను చేసిన పాత్రను బట్టి నిజజీవితంలోనూ తన క్యారెక్టర్‌ అంతేనని సోషల్‌ మీడియాలో చాలా ట్రోల్‌ చేశారు. తనతో పాటు తన పేరెంట్స్‌ను కూడా తిట్టారు.

ఈ నటి గతంలో యూట్యూబర్‌ సరయుతో కలిసి పని చేసింది. తర్వాత ఏమైందో ఏమో కానీ అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. బోల్డ్‌గా మాట్లాడే ఈ బ్యూటీకి మందు తాగే అలవాటు కూడా ఉంది. గతంలో ఒకరిని గాఢంగా ప్రేమించింది. కానీ ఆ ప్రేమ పెళ్లివరకు రాకముందే బ్రేకప్‌ అయింది. పొట్టిగా ఉన్నా తనకు కాన్ఫిడెన్స్‌ ఎక్కువేనంటోంది. ఏదైనా ముఖం మీదే మాట్లాడే ఈ బ్యూటీ బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆరు వారాలు ఉండి బ్యాగు సర్దేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement