స్పెయిన్‌లో మహేష్ బాబు క్రేజ్‌ ఎలా ఉందో చూశారా.. | Fans Rushing to Click Pics with Mahesh Babu Stardom in Spain in Sarkaru Vaari Paata Shooting | Sakshi
Sakshi News home page

Mahesh Babu: మహేశ్‌తో పిక్స్‌ కోసం ఎగబడిన ఫ్యాన్స్‌.. వీడియో వైరల్‌

Published Wed, Oct 27 2021 5:32 PM | Last Updated on Wed, Oct 27 2021 5:34 PM

Fans Rushing to Click Pics with Mahesh Babu Stardom in Spain in Sarkaru Vaari Paata Shooting - Sakshi

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబుకి ఉన్న క్రేజ్‌ గురించి తెలిసిందే. అంత స్టార్‌డమ్‌ ఉన్నప్పటికీ ఆయన ఎంతో ఒద్దికగా, డౌన్‌ టు ఎర్త్‌ ఉంటాడు. ఎవరితో అనవసరంగా దురుసుగా ప్రవర్తించడు. తన పనేదో తాను చూసుకొని వెళుతుంటాడు. అందుకే నటనకి మాత్రమే కాకుండా యాటిట్యూడ్‌కి సైతం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లోనూ ఆయనకి ఫ్యాన్స్‌ ఉన్నారు.

తాజాగా పరశురాం దర్శకత్వంలో మహేశ్‌ హీరోగా ‘సర్కారు వారి పాట’ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ స్పెయిన్‌లో జరుగుతోంది. ఆ సినిమా షూటింగ్‌ గ్యాప్‌లో అభిమానులు ఆయనతో ఫోటోల కోసం ఎగబడ్డారు. ఆయన కూడా ఎంతో ఓపికగా అందరితో కలిసి ఫోజులిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోని ఓ అభిమాని స్పెయిన్‌లో మహేశ్‌ బాబు క్రేజ్‌ అంటూ ట్విట్టర్‌లో షేర్‌ చేశాడు. దీంతో  సూపర్‌స్టార్‌ని చాలామంది ఫ్యాన్స్‌ చుట్టుముట్టి ఉన్న ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా మహేశ్‌ సరసన కీర్తి సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి. మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13, 2022న విడుదల కానుంది.

చదవండి: ఫ్యామిలీతో స్విట్జర్లాండ్‌లో ఎంజాయ్‌ చేస్తున్న మహేశ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement