స్పెయిన్‌ వెళ్లనున్న మహేశ్‌ బాబు | Mahesh Babu To Fly Spain For Sarkaru Vaari Pata Shooting | Sakshi
Sakshi News home page

Mahesh Babu: స్పెయిన్‌కు 'సర్కారు వారి పాట'

Published Fri, Sep 17 2021 8:19 AM | Last Updated on Fri, Sep 17 2021 8:26 AM

Mahesh Babu To Fly Spain For Sarkaru Vaari Pata Shooting - Sakshi

ఈ నెలాఖరున మహేశ్‌బాబు స్పెయిన్‌ వెళ్లనున్నారు. ‘సర్కారువారి పాట’ సినిమా చిత్రీకరణ కోసమే అక్కడికి వెళుతున్నారు. మహేశ్‌ బాబు హీరోగా పరశురామ్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. కీర్తీ సురేష్‌ కథానాయిక. నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, మహేశ్‌బాబు నిర్మిస్తున్నారు. సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్‌ నిరవధికంగా జరుగుతోంది.

ఈ నెలాఖరున స్పెయిన్‌లో ఆరంభించే షెడ్యూల్‌లో టాకీతో పాటు రెండు పాటలను చిత్రీకరించడానికి ప్లాన్‌ చేశారు. స్పెయిన్‌ షెడ్యూల్‌ నెల రోజుల పాటు జరుగుతుందని తెలిసింది. ఆ తర్వాత  డిసెంబర్‌లో జరిపే షెడ్యూల్‌తో సినిమా మొత్తం పూర్తయిపోతుంది. జనవరి 13న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌. తమన్, కెమెరా: ఆర్‌. మది, లైన్‌ ప్రొడ్యూసర్‌: రాజ్‌కుమార్‌. 

చదవండి : రమ్మకృష్ణ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో త్రిష, ఖుష్భూ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement