చిత్ర పరిశ్రమలో చాలా మందికి సెంటిమెంట్ ఉంటుంది. టైటిల్ అనౌన్స్ మొదలు.. రిలీజ్ డేట్ వరకు ప్రతీదీ సెంటిమెంట్‌ని ఫాలో అవుతారు. అలాగే వాళ్లు వాడే వాహనాల నెంబర్ విషయంలో కూడా సెంటిమెంట్‌ను ఫాలో అవుతారు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తన కారు నెంబర్(9999) విషయంలో ఇదే ఫాలో అవుతారనుకుంటారు అంతా. కానీ అదంతా ఒట్టి పుకారే.తనకు సెంటిమెంట్స్‌పై పెద్దగా నమ్మకం లేదని ఎన్టీఆర్ ఓ సందర్భంలో చెప్పాడు. కానీ 9 అనే అంకె అంకె మాత్రం ఆయనకు ఇష్టమట. తన తాత (సీనియర్ ఎన్టీఆర్) కారు నెంబర్ 9999 అని, తన తండ్రి (హరికృష్ట) కూడా అదే వాడాడని.. అందుకే తనకు ఆ నెంబర్ అంటే ఇష్టమని ఎన్టీఆర్ చెప్పాడు. కారుతో పాటు ట్విటర్ ఖాతాలో కూడా ఎన్టీఆర్ 9999 (@tarak9999)కనిపిస్తుంది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలో నటిస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య సుమారు రూ.450 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తైన వెంటనే తారక్.. కొరటాల శివ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించనున్నాడు.
చదవండి:
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సర్‌ప్రైజ్ వచ్చేసింది
సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ, వెల్లువలా బర్త్‌డే విషెస్
Comments
Please login to add a commentAdd a comment