ఎలాంటి విషయం అయినా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పే నటీనటుల్లో బాలీవుడ్ బ్యూటీ క్వీన్ కంగనా రనౌత్ ఒకరు. సినిమా విషయాలతో పాటు రాజకీయ అంశాలను కూడా తరచు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. కాంట్రవర్సీ క్వీన్‌గా పేరు తెచ్చుకుంది. తన మాటలు కాంట్రవర్సీ అయినా కూడా.. ధైర్యంగా ఎదుర్కొగలదు. తాజాగా జనరేషన్ జెడ్(1997 నుంచి 2012 మధ్య పుట్టినవారు)పై తనదైన శైలీలో విమర్శలు గుప్పించింది ఈ వివాదాస్పద నటి.
జనరేషన్ జెడ్(Gen Z) వాళ్లకి క్రమశిక్షణ, హార్డ్ వర్క్‌తో ఎదిగిన వారంటే ఇష్టముండదు. షార్ట్ కట్స్‌లో సక్సెస్ పొందిన వారినే గౌరవిస్తారని విమర్శించింది. ‘జనరేషన్ జెడ్ వాళ్ల చేతులు, కాళ్లు కర్రల మాదిరిగా ఉంటాయి. ఒకరితో ఇంటరాక్ట్ కావడం, చదవడం కంటే కూడా ఎక్కువ సమయం ఫోన్‌లలోనే గడుపుతారు. వారి మనసులు స్థిరంగా ఉండలేవు. ఆఫీస్‌లో బాస్‌ను గౌరవించరు కానీ ఆ పొజిషన్ తమకు కావాలనుకుంటారు.
స్టార్‌బక్స్, అవోకాడో టోస్ట్‌లను ఇష్టపడతారు కానీ సొంతగా ఇల్లు కొనుక్కునే స్థోమత ఉండదు. ఇతరులను అట్రాక్ట్ చేసేందుకు బ్రాండెడ్ దుస్తులు రెంట్‌కు తీసుకుంటారు కానీ కమిట్‌మెంట్ లేదా పెళ్లిని ద్వేషిస్తారు. చివరికి శృంగారం విషయంలో కూడా బద్ధకంగా వ్యవహరిస్తున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. వీళ్లను ఈజీగా మానిప్యులేట్ చేయొచ్చు’అని జనరేషన్ జెడ్ గురించి కంగనా తన ఇన్‌స్టా స్టోరీలో ఇలా రాసుకొచ్చింది. కంగనా రనౌత్ ప్రస్తుతం ఇందిరాగాంధీ బయోపిక్ ఎమర్జెన్సీలో నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment