రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'ఆర్‌ఆర్‌ఆర్' విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. దీంతో మళ్లీ ఈ సినిమాకు సంబంధించిన హడావుడి షురూ అయింది. ఆర్‌ఆర్‌ఆర్ మాస్ బిగెన్స్ అనే హ్యాష్ ట్యాగ్ పేరుతో సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తున్నారు. భారత్‌లోనే కాదు విదేశాల్లోనూ ఆర్ఆర్ఆర్ సినిమాకు ఉన్న క్రేజ్ ఏంటో తెలిపేలా ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది. కెనడా అభిమానులు ఆర్ఆర్ఆర్, ఎన్టీఆర్ పేర్లను కార్లతో రూపొందించారు. ఎన్టీఆర్‌కు వారు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
చదవండి: సమంత హాట్ ఫొటోపై దగ్గుబాటి వారసురాలు కామెంట్
ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్ఆర్ఆర్ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. కాగా, రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుదల ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. కరోనా తగ్గడంతో ఈ నెల 25న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి తర్వాత రాజమౌళి రూపొందిస్తోన్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
చదవండి: లైవ్‌లో ఎక్స్‌లవ్, బ్రేకప్‌పై ప్రశ్న, రష్మిక ఏం చెప్పిందంటే..
దానికి తోడు ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాలో కొమరం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్, పాటలు, పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను మళ్లీ మొదలు పెడుతున్నారు. కరోనా కూడా తగ్గుముఖం పట్టడంతో 'ఆర్ఆర్ఆర్' విడుదలతో సినిమా థియేటర్లకు మళ్లీ ప్రేక్షకులు పెద్ద ఎత్తున రావడం మొదలు పెడతారని అంచనాలు ఉన్నాయి.
Canada NTR fans team effort. Thank you all for making this huge success
— Canada NTR Fans (@canadantrfans) March 11, 2022
Jai NTR✊🏻✊🏻#Thokkukuntupovaale#canadantrfans #RRRMovie @tarak9999 @RRRMovie pic.twitter.com/8NURfIq4b7
Comments
Please login to add a commentAdd a comment