Rakul Preet Singh Marriage: Jackky Bhagnani Rakul Preet Singh Marriage | త్వరలో ప్రియుడిన పెళ్లి చేసుకోబోతోన్న రకుల్‌ - Sakshi
Sakshi News home page

Rakul Preet Singh Marriage: ప్రియుడిని పరిచయం చేసిన రకుల్‌

Published Sun, Oct 10 2021 2:12 PM | Last Updated on Sun, Oct 10 2021 3:41 PM

Rakul Preet Singh Announced She Marries Jackky Bhagnani Soon On Social Media - Sakshi

స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా బాలీవుడ్‌ హీరో, నిర్మాత జాకీ భగ్నానీతో సీక్రెట్‌గా ప్రేమ వ్యవహరం కొనసాగిస్తున్న రకుల్‌ తాజాగా వారి రిలేషన్‌ను సోషల్‌ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. దీంతో అతడితోనే రకుల్‌ త్వరలోనే ఏడడుగులు వేయబోతుందని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా జాకీ భగ్నానీ ఈ ఏడాది తనకు దొరికిన అతి పెద్ద గిఫ్ట్‌గా రకుల్‌ పెర్కొంది.

తన ఇన్‌స్టాగ్రామ్‌లో జాకీ బగ్నాని చేతిని పట్టుకుని నడుస్తున్న ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘నా జీవితంలో ఎన్నో రంగులను జత చేశావు. ఈ ఏడాది నాకు దొరికిన అతి పెద్ద గిఫ్ట్‌ నువ్వు. నన్ను ఎప్పుడూ నవ్విస్తూనే ఉంటావు. ఇలా ఇద్దరం కలిసి ఇంకా ఎన్నో మధర జ్ఞాపకాలను తయారు చేసుకుందాం’ అంటూ హార్ట్‌ ఎమోజీలతో తన పోస్ట్‌ను నింపేసింది. కాగా ఈ రోజు రకుల్‌ బర్త్‌డే. నేటితో ఆమె 31వ వసంతంలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా ఆమె ప్రపంచానికి తన ప్రేమను  పరిచయం చేయడం విశేషం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement