![Rakul Preet Singh Upcoming Bollywood Movies - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/23/rakul.jpg.webp?itok=OvUpRSta)
రకుల్ ప్రీత్ సింగ్.. టాలీవుడ్ లో రకుల్ ఒకప్పుడు నెం.1 హీరోయిన్. కుర్రకారు డ్రీమ్ గర్ల్ . బిగ్గెస్ట్ మూవీస్ ఆమె హీరోయిన్. కానీ 2017 నుంచి సీన్ మారిపోయింది. ఆమెకు తెలుగులో అవకాశాలు తగ్గడం మొదలైంది. అందుకే రకుల్ బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. రెండేళ్లుగా ఆమె చేస్తూన్న హిందీ సినిమాలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ప్రస్తుతం రకుల్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 హిందీ చిత్రాల్లో రకుల్ నటిస్తోంది. ఇవన్ని కూడా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఆయుష్మాన్ ఖురానా డాక్టర్ జీ, అజయ్ దేవగన్ , సిద్ధార్ద్ మల్హోత్రా మల్టీస్టారర్ థ్యాంక్ గాడ్, అమితాబ్, అజయ్ దేవగన్ మల్టీస్టారర్ రన్ వే 34, జాన్ అబ్రహం యాక్షన్ మూవీ ఎటాక్, అక్షయ్ కుమార్ తో మిషన్ సిండ్రెల్లా,ఛత్రివాలి లాంటి చిత్రాల్లో రకుల్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ లోనూ లీడింగ్ లేడీగా మారేందుకు ట్రై చేస్తున్న రకుల్.. సక్సెస్ సాధిస్తుందో లేదో చూడాలి మరి.
Comments
Please login to add a commentAdd a comment