![Rashmika Mandanna To Act With Ram Charan In Shankar Movie - Sakshi](/styles/webp/s3/article_images/2021/02/18/rashmika.jpg.webp?itok=Husi4A1w)
హీరో రామ్ చరణ్, దక్షిణాది దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో రామ్‌చరణ్‌కు జోడీగా ఎవరు నటిస్తారన్న చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో సూపర్ హిట్ చిత్రాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్నా ఈ చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది. స్వయంగా హీరో రామ్‌చరణ్ ఆమె పేరును సూచించినట్లు సమాచారం. ఇప్పటికే రష్మికకు టాలీవుడ్‌లో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్‌గా మారిన రష్మిక..వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది.
ఇప్పటికే సుకుమార్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న 'పుష్ప' సినిమాలో ఆమె హీరోయిన్‌గా నటిస్తుంది. దీంతో పాటు తమిళం, కన్నడ , హిందీ సినిమాలతో రష్మిక ఫుల్ బిజీబిజీగా ఉంది. ఇప్పుడు శంకర్- రామ్‌చరణ్ కాంబినేషన్‌లో మరో భారీ బడ్జెట్ సినిమాలో రష్మిక ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో చెర్రి 15వ చిత్రం కాగా.. ఎస్‌వీసీ బ్యానర్‌లో ఇది 50వ చిత్రం కావడం విశేషం. రామ్‌చరణ్- శంకర్ కాంబినేషన్ కావడంతో ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్‌లో బిజీగా ఉన్న రామ్‌చరణ్.. చిరంజీవి ‘ఆచార్య సినిమాలో చరణ్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు.
చదవండి : (రామ్‌చరణ్, యశ్‌తో శంకర్ మల్టీస్టారర్!)
(‘ఆర్‌ఆర్‌ఆర్’లో నా క్యారెక్టర్ అదే : రామ్‌చరణ్)
Comments
Please login to add a commentAdd a comment