![RGV Anthem: Ram Gopal Varma Says No Thanks - Sakshi](/styles/webp/s3/article_images/2021/04/7/48.jpg.webp?itok=KSxecbGA)
బర్త్‌డే అనగానే అందరూ సంబరాలు చేసుకుంటారు. కానీ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మాత్రం బర్త్‌డేను డెత్‌డేలా ఫీలవుతాడు. ఎందుకంటే బర్త్‌డే వచ్చిందంటే ఆయుష్షులో ఒక సంవత్సరం తగ్గిపోయినట్లే అని చెప్తున్నాడు. ఇక ఎవరు తనకు బర్త్‌డే విషెస్ చెప్పినా వారికి థ్యాంక్స్‌కు బదులు నో థ్యాంక్స్ అని రిప్లై ఇస్తున్నాడు. ఇదిలా వుంటే ఆయన అభిమానులు ఓ స్పెషల్ సాంగ్‌తో ఆర్జీవీని సర్‌ప్రైజ్ చేశారు. ఈ విషయాన్ని వర్మ ట్విటర్‌లో పేర్కొంటూ ఆర్జీవీ యాంథెమ్ సాంగ్ లింక్‌ను షేర్ చేశాడు.
"నాకోసం ఏదైనా చేయండి అని అడక్కపోయినా నా బర్త్‌డే సాంగ్ క్రియేట్ చేశారు. దీనికోసం కష్టపడ్డ అందరికీ నో థ్యాంక్స్.." అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఈ సాంగ్‌లో ప్రత్యేకంగా లిరిక్స్ ఏమీ లేవు. కేవలం ఆర్జీవీ తీసిన సినిమాలనే ప్రత్యేకంగా ఓ వరుస క్రమంలో కూర్చి ఈ పాటను తయారు చేశారు. గౌరవ్ ప్రాతమ్ సంగీతాన్ని సమకూర్చగా నేహా కరోడే ఆలపించింది. "శివరాత్రి అంతం గాయం క్షణక్షణం.. గోవిందా రంగీలా సత్య కంపెనీ.." అంటూ ఈ పాట మొదలవుతుంది. ఈ యాంథెమ్‌లో 'సైకో', 'రౌడీ', 'డేంజరస్' అన్నీ ఆర్జీవే అని చెప్తున్నారు. ఈ పాట వర్మ అభిమానులను ఆకర్షిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment