Samantha Shares Emotional Post On New Year: ప్రపంచమంతా న్యూ ఇయర్ వేడుకల్లో మునిగితేలుతోంది. గత సంవత్సరం మధురు స్మృతులు, చేదు జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తున్నారంతా. అలాగే స్టార్ హీరోయిన్ సమంత కూడా. 2021 ఆమెకు ఎంతటి చేదు అనుభవాన్ని మిగిల్చిందో అందరికి తెలిసిందే. నాగ చైతన్యతో విడిపోయిన సామ్ కొంతకాలంగా మనోవేదనతో బాధపడుతోంది. విడాకుల ప్రకటన అనంతరం భావోద్వేగ పోస్ట్స్‌తో సోషల్ మీడియా వేదికగా తన బాధను, ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వస్తోంది.
చదవండి: న్యూ ఇయర్‌లో కీలక ప్రకటన ఇవ్వబోతున్న ‘గీత గోవిందం’ జంట!
అలాగే తన న్యూ ఇయర్ సెలబ్రెషన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఈ కొత్త సంవత్సరంలో ఎలా ముందుకు సాగాలో చెబుతూ ఇన్‌స్టాగ్రామ్ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. తన పెంపుడు కుక్కలు బెడ్‌పై పడుకున్న ఫొటోను షేర్ చేస్తూ తన లైఫ్‌ని, ఫ్యాన్స్‌ను ఉద్దేశిస్తూ ఇలా రాసుకొచ్చింది. ‘ఈ సంవత్సరం మీ అతిపెద్ద అచీవ్‌మెంట్ చాలా దూరం అయితే, ఆ రోజును మీరు ఫేస్ చేయలేకపోతే యదావిదిగానే ఉదయం నిద్ర లేవండి. అలాగే సాధారణ జీవితాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోవడం అలవర్చుకోండి.
చదవండి: న్యూ ఇయర్‌కు భోళా శంకర్ టీం మెగా ట్రీట్, అదిరిపోయిన స్పెషల్ వీడియో
మీకు నమ్మకం కలిగించే విషయాలను కనుగొనడం మొదలు పెట్టడండి. మీతో మీరు జన్యున్‌గా ఉండి. అలాగే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే ప్రతి చిన్న అడుగును కూడా ఎప్పటికి మీరు మర్చిపోవద్దు. ఇలాంటి విషయాల్లో మన అందరం కలిసి ఉన్నాము. ఈ 2022లో మరింత స్ట్రాంగ్‌గా, తెలివిగా, మరింత దయతో ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ సామ్ హ్యాపీ న్యూ ఇయర్ పోస్ట్ షేర్ చేసింది. ప్రస్తుతం సామ్ పోస్ట్ ప్రతి ఒక్కరి హత్తుకుంటోంది. న్యూ ఇయర్ రోజున తన ఒంటరి జీవితాన్ని, ఒంటరి తనాన్ని ఇలా పంచుకుందంటూ ఆమె ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment