కోపమొస్తే తల్లి అని కూడా చూడను, తిట్టేస్తా: శ్రీలీల | Sreeleela About Her Anger and Aparichitudu | Sakshi
Sakshi News home page

Sreeleela: అమ్మ అని కూడా చూడకుండా తిడ్తా, కానీ తర్వాత ఏడుస్తా

Published Sun, Jan 8 2023 6:56 PM | Last Updated on Sun, Jan 8 2023 7:07 PM

Sreeleela About Her Anger and Aparichitudu - Sakshi

'పెళ్లిసందD' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీలీల నక్కతోక తొక్కి వచ్చినట్లుంది. వరుసగా స్టార్‌ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుంటోంది. ఇప్పటికే మాస్‌ మహారాజ రవితేజతో ధమాకాలో నటించగా ఈ మూవీ రూ.100 కోట్లు సాధించి బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఇకపోతే మహేశ్‌బాబు - త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీలోనూ శ్రీలీల ఛాన్స్‌ కొట్టేసిన విషయం తెలిసిందే! ఈ సినిమా నుంచి శ్రీలీల సైడ్‌ అయిపోయిందన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. అలాగే నవీన్‌ పొలిశెట్టితో అనగనగా ఒక రాజు, నితిన్‌తో ఓ చిత్రం, రామ్‌ పోతినేనితో మరో మూవీ చేస్తున్నట్లు భోగట్టా!

తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తనలో ఒక అపరిచితుడు ఉన్నాడని పేర్కొంది. కొన్నిసార్లు తనకు తెలియకుండానే కోపం తన్నుకువచ్చేస్తుందని తెలిపింది. పెద్ద ముక్కు ఉన్నవాళ్లు కోపిష్టులని, అలా తనకూ కోపం ఎక్కువ వస్తూ ఉంటుందని, ఆ సమయంలో అందరి మీదా అరిచేస్తానంటోంది. ఎక్కువసార్లు అమ్మ మీదే అరుస్తానని, కానీ.. కోపం చల్లారిన తర్వాత అమ్మను తిట్టినందుకు ఏడుస్తానని చెప్పింది శ్రీలీల. అపరిచితుడులా ప్రవర్తిస్తున్నావని అమ్మ కూడా తనను ఎప్పుడూ అంటూ ఉంటుందని ప్రస్తావించింది. అమ్మ కాబట్టి తనను భరిస్తోందని, వేరొకరైతే ఎప్పుడో పారిపోయేవారని కామెంట్‌ చేసిందీ యంగ్‌ బ్యూటీ.

చదవండి: కొడుకును బ్లాక్‌మెయిల్‌ చేసిన శ్రీహాన్‌
త్వరలో తల్లి కాబోతున్న అనుష్క

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement