రామప్ప ఆలయాన్ని సందర్శించిన కొరియోగ్రాఫర్
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని కొరియోగ్రాఫర్ జ్యోతిరాజ్ సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి ఆమె పూజలు నిర్వహించగా.. ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ శిల్పాకళాసంపద గురించి గైడ్ తాడబోయిన వెంకటేష్ వివరించగా రామప్ప ఆలయం అద్భుతంగా ఉందని ఆమె కొనియాడారు.
ఏఎన్‌ఎంలతో సర్వే
చేయించడం సరికాదు..
ములుగు రూరల్: ఎల్‌సీడీసీ సర్వేను రెండో ఏఎన్‌ఎంలతో చేయించడం సరికాదని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ అన్నారు. జిల్లా వైద్యాధికారి కార్యాలయ సూపరింటెండెంట్ విజయభాస్కర్‌కు సోమవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఏఎన్‌ఎంలతో ఎక్కడా ఎల్‌సీడీసీ సర్వే చేయడం లేదన్నారు. జిల్లాలో ఆశలు చేయాల్సిన సర్వేను ఏఎన్‌ఎంలతో చేయించడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముత్యాల రాజు, సంఘం జిల్లా అధ్యక్షురాలు సరోజన, ప్రధాన కార్యదర్శి కోడి సుజాత తదితరులు పాల్గొన్నారు.
విస్తృతంగా వాహనాల తనిఖీ
గోవిందరావుపేట: పస్రా పోలీస్ స్టేషన్ పరిధిలో పస్రా ఎస్సై అచ్చ కమలాకర్ తన సిబ్బందితో కలిసి జాతీయ రహదారిపై వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మావోయిస్టుల బంద్ నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలఛ్ల భాగంగా పస్రా ఎస్సై కమలాకర్ సివిల్, టీజీఎస్‌పీ సిబ్బందితో కలిసి ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఎవరైనా కొత్తగా అనుమానంతో ఉన్న వ్యక్తులు కనపడితే తమకు సమాచారం ఇవ్వాలన్నారు.
ఇద్దరికి తీవ్రగాయాలు
చిట్యాల: రోడ్డుపై పోసిన వరి కుప్పను ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన మండలంలోని జడలపేట గ్రామ శివారులో సోమవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని వరికోల్‌పల్లి గ్రామానికి చెందిన లాడే రాజు, వంగల జశ్వంత్ అనే ఇద్దరి యువకులు డీజిల్ కోసమని కొత్తపేట శివారులో ఉన్న పెట్రోల్ బంక్ వద్దకు ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. జడలపేట గ్రామ శివారులో రహదారిపై రైతులు ఆరబోసిన వరి ధాన్యం కుప్పులకు అడ్డుగా వేసిన రాళ్లను ద్విచక్రవాహనం ఢీకొంది. దీంతో ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో ఇద్దరికి కాళ్లు, చేతులు విరి గాయి. సమాచారం అందుకున్న గ్రామస్తులు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లారు. గా యపడిన వారిని భూపాలపల్లి వంద పడకల ఆస్పత్రికి తరలించారు. రోడ్డపై ధాన్యం కప్పలు ఆరబోయడం మూలంగానే ప్రమాదం చోటు చేసుకుందని బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎకో కూలర్ ప్రాజెక్టుకు విద్యార్థిని ఎంపిక
మల్హర్: జిల్లాస్థాయిలో ఈనెల 7, 8 తేదీల్లో జరిగిన ఇన్‌స్పైర్, సైన్స్ ఫెయిర్‌లో మండలంలోని వల్లెంకుంట జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థిని శనిగరం శివాని ఎకో కూలర్ ప్రాజెక్టు రాష్ట్రస్థాయికి ఎంపికై ంది. ఈ సందర్భంగా సోమవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం గైడ్ టీచర్ ఎల్.రాజు నాయక్, విద్యార్థిని శివానిని అభినందించారు. ఇన్స్పైర్‌లో కాస్ట్ ఎకో కూలర్ ప్రాజెక్టు తక్కువ ఖర్చుతో పేదవారికి అందుబాటులో ఉంటుందన్నారు. కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తూ, పవర్ సేవ్ కాబడుతూ అనేక ఉపయోగాలున్న ఎకో కూలర్ అందరికీ అందుబాటులో ఉంటుందని ప్రధానోపాధ్యాయుడు సుదర్శనం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment