వైజ్ఞానిక ప్రదర్శనను విజయవంతం చేయాలి
ములుగు రూరల్: విద్యార్థులు అంతర్గత శక్తులను వెలికి తీసే బాల వైజ్ఞానిక ప్రదర్శనను విజయవంతం చేయాలని జిల్లా సైన్స్ అధికారి అప్పని జయదేవ్ అన్నారు. మండలంలోని జాకారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సోమవారం జరిగిన సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమానికి నియామకమైన ప్రతీ కమిటీకి అప్పగించిన విధులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్న సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి సర్వం సిద్ధం చేశామన్నారు. జిల్లాలోని ప్రతీ పాఠశాల నుంచి ఆరు ఎగ్జిబిట్లను విధిగా ప్రదర్శించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీఈబీ కార్యదర్శి ఇనుగాల సూర్యనారాయణ, ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, మండల విద్యాశాఖ అధికారి సామల శ్రీనివాస్, గొంది దివాకర్, కేశవరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment