రాష్ట్రస్థాయికి ఎంపికై న విద్యార్థినికి ఘన సన్మానం
చిట్యాల: విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో భాగంగా జిల్లాకేంద్రంలో నిర్వహించిన పోటీలలో జూకల్ ఉన్నత పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థిని కొరండ్ల సిరిచందన జిల్లాస్థాయిలో ప్రథమ స్థానం పొందింది. దీంతో జూకల్ గ్రామస్తులు, పాఠశాల సిబ్బంది హర్షం వ్యక్తంచేస్తూ విద్యార్థినిని అభినందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ఇష్టమైన రంగాన్ని ఎంచుకుని కష్టపడితే జీవితం ఏదైనా సాధించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ జంబుల తిరుపతి, మాజీ పాఠశాల చైర్మన్ దొంతి రాంరెడ్డి,సంతోష్, సాయి సేవా సమితి సాయి రెడ్డి, సూర నరేందర్, కొడారి రవి, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment