నేటినుంచి గనులవారీగా సమావేశాలు
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 10వ తేదీ నుంచి 14వరకు ఏరియాలోని గనుల వారీగా మల్టీడిపార్ట్‌మెంట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఏరియాలోని జీఎం కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్‌లో మల్టీడిపార్ట్‌మెంట్ కార్యక్రమానికి సంబంధించి అన్ని గనులను హెచ్‌ఓడీలతో సోమవారం సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సమావేశంలో సంస్థ ఉత్పత్తి ఉత్పాదకత అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 14న ఏరియాలో నిర్వహించే సమావేశాలను పకడ్బందీగా నిర్వహించి బొగ్గు ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలని జీఎం కోరారు. ఈ సమావేశంలో అధికారులు కవీంద్ర, జ్యోతి, వెంకటరామరెడ్డి, పద్మజ, మారుతి పాల్గొన్నారు.
సంస్థ అభివృద్ధికి దోహదపడాలి
సింగరేణిలో నూతనంగా విధుల్లో చేరుతున్న మేనేజ్‌మెంట్ ట్రైనీ(మైనింగ్) సిబ్బంది సింగరేణి సంస్థ అభివృద్దికి దోహదపడాలని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి సూచించారు. సోమవారం వారు విధుల్లో చేరిన సందర్బంగా జీఎం వారిని ఉద్దేశించి మాట్లాడారు. నూతనంగా మైనింగ్‌లో ఎంపికై న ఉద్యోగులు నిరంతరం శ్రమిస్తూ ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు కవీంద్ర, జ్యోతి, వెంకటరామరెడ్డి, మారుతి, కార్తీక్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment