మావోయిస్టుల బంద్ ప్రశాంతం
వాజేడు: చెల్పాకలో జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టులు సోమవారం తలపెట్టిన తెలంగాణ బంద్ ప్రశాంతంగా ముగిసింది. బంద్ నేపథ్యంలో కొన్నిచోట్ల దుకాణాలు బంద్ చేయగా కొన్నిచోట్ల తెరిచారు. మండలపరిధిలోని టేకులగూడెం గ్రామ చివరణ జాతీయ రహదారిపై పేరూరు ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ సివిల్, సీఆర్‌పీఎఫ్ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా మావోయిస్టుల కదలికలపైనే దృష్టి కేంద్రీకరించి ప్రతీ వాహనాన్ని సోదా చేశారు. అనుమానితులను ప్రశ్నించడంతో పాటు ప్రయాణికుల వస్తువులను తనిఖీ చేశారు. మండలంలో ఆటోలు, ఇతర వాహనాలు కూడా తక్కువగా తిరిగాయి. మావోయిస్టుల బంద్ నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
కిరాణ షాపులు, హోటళ్లు, బంక్‌లు బంద్..
వెంకటాపురం(కె): చెల్పాక ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టులు చేపట్టిన బంద్ సోమవారం ప్రశాంతంగా జరిగింది. బంద్ సందర్భంగా మండలకేంద్రంలోని కిరాణ షాపులు, హోటళ్లు, పెట్రోల్ బంక్‌లు, సినిమాహాళ్లు తెరుచుకోలేదు. ఆటోలు యథావిధిగా తిరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment