జీపీఎస్‌లపై పర్యవేక్షణ కరువు
మంగపేట : మండలంలోని ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాల(జీపీఎస్)ల నిర్వహణపై సంబంధిత ఐటీడీఏ విద్యావిభాగం అధికారుల పర్యవేక్షణ పూ ర్తిస్థాయిలో లేకపోవడంతో అనేక సమస్యలకు నిలయంగా మారాయి. మండలంలో 21 జీపీ పాఠశాలలు ఉండగా చుంచుపల్లిలోని గిరిజన ప్రాథమిక పా ఠశాలను ఆదర్శ(మోడల్) పాఠశాలగా 2018లో ఎంపిక చేశారు. గిరిజన విద్యార్థులకు కార్పొరేట్‌కు ధీటుగా ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లిష్ మీడియం బోధన అందించేందుకు పాఠశాలను ఎంపిక చేశారే తప్ప ఆరేళ్లు పూర్తవుతున్నా ఇప్పటి వరకు పాఠశాలలో అదనపు తరగతుల గదుల ఏర్పాటు చేయలేదు. పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు 39 మంది విద్యార్థినీ విద్యార్థులు ఉండగా పాఠశాలలో ఒకే గ దిలో ఐదు తరగతులు కొనసాగడం గమనార్హం.
అన్ని పాఠశాలల్లో ఇదే తీరు..
మండలంలోని జీపీ పాఠశాలల్లో ఎక్కడ చూసినా ఇదే తీరు కనిపిస్తోంది. ఆదర్శ పాఠశాలలోనే అదనపు తరగతి గదుల సమస్యను పట్టించుకోక పో వడం చూస్తుంటే ఏజెన్సీలోని జీపీఎస్ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పాఠశాలల భవనాలపై పర్యవేక్షణ, మరుగుదొడ్లు, మూత్రశాలల ఏర్పాటు, తాగునీటి వసతి, ప్రహరీ తదితర సదుపాయాల కల్ప నపై ఐటీడీఏ విద్యావిభాగానికి చెందిన ఉన్నతాధికారులు పర్యవేక్షణ క్షేత్రస్థాయిలో లేక పోవడంతో అరకొర వసతుల మధ్య పాఠశాలల నిర్వహణ కొనసాగుతోంది. ప్రధానంగా 30 ఏళ్ల క్రితం నిర్మించిన పలు పాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నా యి. 10కి పైగా పాఠశాలలకు సరిపడా తరగతి గదులు లేక పోవడంతో ఒకే గదిలో విద్యాబోధన కొనసాగడం ఆశ్చర్యకరం.
మోడల్ స్కూళ్లలో కొరవడిన వసతులు
ఒకే గదిలో ఐదు తరగతుల నిర్వహణ
స్కావెంజర్ల నియామకంపై దృష్టి
సారించని అధికారులు
విద్యాబోధన కష్టతరంగా ఉంది
పాఠశాలకు వరండాతో పాటు ఒక తరగతి మాత్రమే ఉంది. అందులోనే ఐదు తరగతులకు చెందిన 39 మంది విద్యార్థులకు విద్యాబోధన చేయడం చాలా ఇబ్బందిగా ఉంది. అధికారులు స్పందించి మోడల్ పాఠశాల నిర్వహణకు అదనపు తరగతి గదులు నిర్మించాలి.
– చింత కృష్ణమూర్తి, హెచ్‌ఎం, గిరిజన ప్రాథమిక మోడల్ పాఠశాల, చుంచుపల్లి
Comments
Please login to add a commentAdd a comment