ఆర్‌ఓఆర్ బిల్లును ఉపసంహరించుకోవాలి
వెంకటాపురం(కె): ఆర్‌ఓఆర్ చట్టం ఆమోదం పొందడం ఆదివాసీలకు చీకటి రోజు అని, ఆర్‌ఓఆర్ చ ట్టం బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏఎన్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కొర్స నర్సిమూర్తి అన్నా రు. మండల కేంద్రంలో జీఎస్పీ ఆధ్వర్యంలో పూ నెం సాయి చేపట్టిన మూడో రోజు దీక్షకు నర్సింహమూర్తి సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఆర్‌ఓఆర్ బిల్లు గిరిజనుల అస్తిత్వాన్ని బొందపెట్టే విధంగా ఉందన్నారు. 2020లో కేసీఆర్ తెచ్చిన భూ చట్టాన్ని షెడ్యూల్ ఏరియాలో యథాతధంగా కొన సాగిస్తున్నారన్నారు. ఎల్‌టీఆర్ చట్టాన్ని ఉల్లంఘించి గిరిజనేతరులకు ఇచ్చిన భూమి హక్కుల కొన సాగింపుగా రైట్స్ అఫ్ రికార్డ్స్ చట్టం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులందరూ కాంగ్రెస్ పక్షాన నిల బడ్డారని గుర్తు చేశారు. నూతన భూ చట్టంలో గ్రామ కంఠం, అక్రమంగా గిరిజనేతరుల సాగులో ఉన్న భూములకు హక్కులు కల్పించ డం ద్వారా గిరిజనులను నయవంచన చేశారని అ న్నారు. ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూ మిపై కుట్ర చేసి ఆడవాళ్లపై పాశవికంగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మహేష్, రవి పాల్గొన్నారు.
ఏఎన్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సిమూర్తి
Comments
Please login to add a commentAdd a comment