పెరటి కోళ్లతో అదనపు ఆదాయం
వాజేడు: పెరటి కోళ్ల పెంపకంతో అదనపు ఆదా యం పొంద వచ్చని ములుగు జిల్లా పశు వైద్యాధికారి కొమరయ్య, ఆఫీసర్ ఇన్‌చార్జ్ హెడ్ డాక్టర్ అమరేశ్వరి అన్నారు. మండల పరిధిలోని చీకుపల్లి, పెద్ద గొళ్లగూడెం గ్రామాల్లో బుధవారం పీవీ నర్సింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం పశుపరిశోధన క్షేత్రం మామునూరు ఆధ్వర్యంలో కోడి పిల్లలను పంపిణీ చేశారు. 95 ఎస్‌టీ లబ్ధిదారులకు ఆరు వారాల వయస్సు కలిగిన 2300 కోడి పిల్లలను, దాణా, నీటి తొట్టెలను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోళ్ల పంపిణీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్య క్రమంలో పశువైద్యులు నర్సింహారావు, శ్రీనిధి, శాస్త్రవేత్త ప్రశాంత అకుమార్ పాల్గొన్నారు.
జిల్లా పశువైద్యాధికారి కొమరయ్య
Comments
Please login to add a commentAdd a comment